చిత్రం: అమ్మాయి కోసం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలత
నటీనటులు: మీనా, రవితేజ, వినీత్ , ఆలీ, శివారెడ్డి, సాయికుమార్
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: పోకూరి బాబురావు
విడుదల తేది: 18.05.2001
పల్లవి:
చాందిని నువ్వే నా చాందిని
చాందిని నువ్వే నా చాందిని
మనసుమేలుకొని మనవి చేసుకొని
చెలికి కానుక కానీ…
చాందిని నేనే నీ చాందిని
చరణం: 1
చినుకంటి బ్రతికినాది ముత్యంలా మారింది
నీ చేతి చలువ చేతనే
మౌనంలో కావ్యాలెన్నో మధురంగా విన్నాలే
నీలోని ప్రేమవలనే
నీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం సరిపోదు
ప్రణయంతో పోలిస్తే సరితూగే సిరి లేదు
పురివిప్పు ప్రియ భావమా
చాందిని నేనే నీ చాందిని
చరణం: 2
కలలన్ని ఆకాశంతో కబురే పంపే వేళ
హరివిల్లే చేతికందగా
శిల్పంలా మలిచావమ్మా ప్రేమే ప్రాణం చేసి
నేనేంటో నాకే చెప్పగా
చిరునవ్వుల వీణల్లో తొలివలపే సాగింది
సరికొత్తకోణం లో జగమెంతో బాగుంది
చిగురించు తొలి చైత్రమా
చాందిని నువ్వే నా చాందిని
చాందిని నేనే నీ చాందిని
మనసుమేలుకొని మనవి చేసుకొని
చెలికి కానుక కానీ…
చాందిని నేనే నీ చాందని