Ammayila Sapatham (1974)

చిత్రం: అమ్మాయిల శపథం (1975)
సంగీతం: విజయ్ భాస్కర్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలు, వాణీ జయరాం
నటీనటులు: చంద్రమోహన్, చంద్రకళ, రామకృష్ణ, లక్ష్మీ
దర్శకత్వం: జి.వి.ర్. శేషగిరిరావు
నిర్మాతలు: డి.వెంకటేశ్వరు
లు
విడుదల తేది: 1975

నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా

కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
ఎదుట నిలిచె చూడుమా

అనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
అనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా
కనుల యెదుట నిలిచెగా
రా.. జాబిల్లీ నా నెచ్చెలీ..
జాగేల.. ఈవేళ.. నను చేరగా

నీలి మేఘమా జాలి చూపుమా..
ఒక నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి
నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ

కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా..
కంఠాన సూత్రాన్ని ముడివేయనా..
గుండె గుడిగా చేయనా..
నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై… సావాసినై…
నా ప్రేమ పుష్పాల పూజించనా…

కన్నె అందమా కలత మానుమా..
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము
ఎదుట నిలిచె చూడుమా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Tholi Valapu (2001)
error: Content is protected !!