చిత్రం: అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: చక్రి , కౌశల్య
నటీనటులు: విజయ్, మొహిత్, సోనూసూద్, దేవిన బెనర్జీ, విద్యా, స్వప్న మాధురి
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: పి. కిరణ్
విడుదల తేది: 30.01. 2003
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే
నాతొ నీవు ఉంటే ఆనందం నా వెంటే
ఈ రోజె మెరిసింది ఒక తారక
నీ స్నేహం కోరింది మనసాగక
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
మళ్ళి మళ్ళి రాదు మనకోసం ఈ రోజు
చేయి కలిపి చూడు మధుమాసం ప్రతిరోజు
చెప్పనా నీ రూపమె ఎద చేరిందని
చెప్పక ఇక తప్పదు ఇది ప్రేమేననీ
పరుగులు తీసె వయసులలోన కోరిక తరుమునులె
ప్రేమని దానికి పేరును పెడితె తప్పేనులే
మీకేం మగవారు తెగ మాటలు చెబుతారు
ఇంతా తెలిసాక ఇక చాలు చాలు మరి చూపులెందుకని
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే
నాతొ నీవు ఉంటే ఆనందం నా వెంటే
హాయిగా నీ ధ్యాసలొ నిదురించాలని
సాయమే చెలి కోరితె ఇటు రావే మరీ
ఇరువురి మనసులు కలువని ప్రేమ ఎన్నడు గెలవదులే
చెదిరిన మదిలొ చెలిమికి చోటే లేదందిలే
నిండా ప్రేముండి మీరెందుకు దాస్తారు
అయ్యొ అమ్మాయొ ఇది ప్రేమ కాదు అని తెలుసుకోవె మరి
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
నిజం చెప్పమంటే నాకిష్టం నువ్వంటే
నాతొ నీవు ఉంటే ఆనందం నా వెంటే
*********** ************ ***********
చిత్రం: అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: శ్రీనివాస్ , కౌశల్య
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
ప్రేమ ప్రేమ నన్ను దాచుకోవా
ప్రేమ ప్రేమ నన్ను గెలుచుకోవా
గుండెలోతు నుండి గొంతులోకి చేరి మాటలాగా మారే కొంటె ప్రేమ
మాటలన్నీ మరచి చాటు మాటు చూసి ముద్దులాగా మారే జంట ప్రేమ
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
చరణం: 1
ఇరువురి నడుమన తెరలను తెరిచిన ప్రేమే వరము సుమా
పెదవుల గడపన ప్రమిదలు నిలిపిన ప్రేమే మనసుల మహిమా
చూపులనే సైగలుగా మార్చేదే ఈ ప్రేమ
చేతులనే కౌగిలిగా మలచేదే ఈ ప్రేమ
చలిలోన చమరింత ప్రేమే సుమా
కాలిగోటి నుండి పూల కొప్పుదాక నిండి పోయెనమ్మ పిల్ల ప్రేమ
నేల మీద నుండి నీలి నింగిదాక నిచ్చేనేసేనమ్మా పిచ్చి ప్రేమ
ఇష్టపడి కష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి ఇష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
చరణం: 2
మనసను చెరకును చితిమితే చిందిన తీపే ప్రేమ సుమా
వయసను వాగున వరదగ పొంగిన ప్రేమను ఆపగ తరమా
శ్వాసలలో సుర్యుడినే ఉడికించే ఈ ప్రేమ
దోసిలిలో చంద్రుడినే కొలువుంచే ఈ ప్రేమ
అరుదైన అనుభూతి ప్రేమే సుమా
ఎంత కాలమైన ఎన్ని జన్మలైన నిన్ను నమ్ముతుంది కన్నె ప్రేమ
ఎంత దూరమైనా ఎంత భారమైన నిన్ను కోరుతుంది కుర్ర ప్రేమ
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
ప్రేమ ప్రేమ నన్ను దాచుకోవా
ప్రేమ ప్రేమ నన్ను గెలుచుకోవా
గుండెలోతు నుండి గొంతులోకి చేరి మాటలాగా మారే కొంటె ప్రేమ
మాటలన్నీ మరచి చాటు మాటు చూసి ముద్దులాగా మారే జంట ప్రేమ
ఇష్టపడి ఇష్టపడి నిన్నే చేరుకున్నా మనసుపడి
కష్టపడి కష్టపడి నిన్నే కలుసుకున్నా మదనపడి
*********** ************ *************
చిత్రం: అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: శ్రీనివాస్ , కౌశల్య
నీలోని అందాలూ చూసానులే తెలిమంచు తెర చాటులో
నాలోని భావాలు తెలిసాయిలే తొలి ప్రేమ తీరాలలో
నువ్వు లేని క్షణమే నాకేమో యుగమే
నీడల్లే నీవెంట నేనే వుంటా
కలలన్ని నిజమై నీలోనే సగమై
కడదాకా విడిపోక నీతో వుంటా
నిను చూస్తూ నను నేనే మరిచానంట
చరణం: 1
నిన్న మొన్న లేని ఆత్రమా
నిన్ను నన్ను కలిపే మంత్రమా
నీకు నాకు ఇంత దూరమా
నేనే నువ్వయ్యాను చూడుమా
చినుకై నను తాకితే చిగురై పులకించదా
ఏదో అయ్యింది నాలో నువ్వేం చేసావో ఏమో
పెదవంచున చిరునవ్వుగా
నిను చేరేదెలా
చరణం: 2
కళ్ళలోకి నువ్వు చూడిలా
నువ్వు తప్ప వేరే లేరుగా
రాతిరేళ నిదుర రాదుగా
చూడకుంటే నిన్ను నేరుగా
నదిలా నువ్వు మారితే అలలా నిను చేరనా
మైకం కమ్మింది నేడు
ఏకం కమ్మంది చూడు
నడుమొంపులో శృతి చేయగా నిను తాకేదెలా
********* ********** ********
చిత్రం: అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సందీప్, కౌశల్య
నువ్వెప్పుడొచ్చావో అపుడే పుట్టింది ఈ ప్రేమ
నీ పక్కకొచ్చానోయ్ ఇపుడే ఆటాడుకుందామా
బొమ్మాట బొర్సాట ఆడేందుకు సయ్యంట
భామాట ప్రేమాట ఆడను పోపొమ్మంట
చరణం: 1
నువ్వేగా సొగసరి postbox
నేనేగా మగసిరి postman
నీలోని పరువపు ప్రతి లెటర్
భలేగా బయటికి తీస్తాను
టూత్ బ్రష్ నువ్వై మౌత్ వాష్కొస్తే
టూత్ పేస్ట్ నేనై ముందుండనా
పొద్దొకసారి మాపొకసారి
పేస్టును బ్రష్ పై అద్దాలి కదరా
కాళ్ళకేసి నిన్ను చూడమంట
గాలమేసి నన్ను లాగమంట
లేడీ ఇలా అంటుండగా టెన్షన్ నీకేంటట
మీ రాంగ్ రూట్లోకి రాలేను పొమ్మంట
చరణం: 2
నువ్వేమో నాటీ ఇంజెక్షన్
నేనేమో నర్స్ ఐ వస్తున్నా
ఉందంట నీలో లవ్ మెడిసిన్
అందించెయ్ వేడిగా ఆ విటమిన్
లైటే నువ్వై లైన్లోకొస్తే బాటరీ నేనై జంటవ్వనా
నైటే చూసి డ్యూటీ చేసి బ్యూటీనంతా వెలిగించి వెళ్ళనా
జంట చేసి నిన్ను చూడమంట
ఇంటిమసీ కాస్త పెంచమంట
ఆడది ఇలా అడిగేయగా ఆటకు లేటేంటట
మనసంటూ లేకుండా ఇంకేమి ఆటంట
********* ********** ********
చిత్రం: అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: రవివర్మ , కౌశల్య
ప్రేమా ఓ ప్రేమా నువ్వే నా ప్రేమా
ప్రేమా ఓ ప్రేమా ఇదేనా ప్రేమ
మనసారా తెలిపా నీకు నాలో ప్రేమ
ఒకసారి కనిపిస్తావా నీలో ప్రేమ
గుండెల్లో నిండుగా వుంది నీపై ప్రేమ
చెప్పాలని వున్నా గొంతే దాటని ప్రేమ
నిన్ను నన్ను కలిపే ప్రేమ
నాలో నేనే నలిగే ప్రేమ
చరణం: 1
నాలో కలలే తెలిసినా దూరం చేయుట న్యాయమా
ఇదివరకెపుడు లేదుగా నాలో ఇంతటి వేదన
మనసు మాటను ఆలకించినా
కొంచమైనా ఆదరించావా
నీకు తెలియని గాధ నాదిలే
చెప్పగలిగే బాధ కాదులే
ఎదురు చూపులు చూడగా
ఇవ్వరా వరముగ నీ ప్రేమ
చరణం: 2
నీకు నాకు నడుమన ప్రేమకు ఊపిరి పోయానా
ప్రేమకు కూడా తెలియని ప్రేమను నాలో దాయనా
నర నరాలలో ప్రేమ ఉందిలే
నీవు నాలో పాణమేనని
పంచ ప్రాణం నాకు నీవులే
పంచలేని ప్రేమ నాదిలే
కలత నిండిన వేళలో
ఇవ్వరా ప్రేమే మానుపురా
********* ********** ********
చిత్రం: అమ్మాయిలు అబ్బాయిలు (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సందీప్, కౌశల్య
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావ
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తేచ్చావ
ఇస్తా వచ్చేయి ఇలా చూస్తా నీ వేడినలా
అబ్బో వచేయి గురు జల్ది చేసెయ్యి శురు
ఇంతగా వేడిని తాకితే సుందరి ఔటేగా ధర్మామీటర్
దోస్కాయ్
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావ
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తేచ్చావ
పోరా పోకిరి ఏంటి అల్లరి తీస్తాం తిమ్మిరి చూడు మరి
చరణం: 1
గిచ్చితే మెచ్చనా పాడు బుల్లోడా
స్విమ్మింగ్ పూల్ కాడ నా సోకు చూసుకోర
చెయ్యనా చిత్తడి పాడు బుల్లెమ్మ
ఇవ్వాళ ఊరు వాడ ఊపొచ్చి ఊగిపోదా
చెమ్ చెమ్ చెమకు చెమ
ధన్ ధన్ ధనకు ధన
అబ్బో అబ్బో దంచకయో అమ్మో అమ్మో పెంచకయో
గుండెల్లో గందర గోళం
నువ్వు తెల్ల పడాలి ఓ కర్రి కుమారి
అహ అందుకనే రిన్ సోప్ రుద్దుకోవాలి
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావ
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తేచ్చావ
చరణం: 2
హాట్‌గా ఇచ్చుకో ఆకు పకోడీ
పరువాల కోడి పెట్ట నిను గంప కింద పెట్ట
మిస్సుతో ఆడుకో కిస్సు కవాలి
నువ్వు లేక పోతే ఎట్ట విప్పాలి సోకు చిట్టా
హే నచ్చావు భళా రా వచ్చేయి ఇలా
అయ్యో అయ్యో అందామలా మళ్ళి మళ్ళి పొంగకలా
వెయ్యకలా ముద్దుల గాలం
ఓ పొట్టి బుడంకాయ్ నువ్వు పొయ్యిలో వంకాయ్
అరె పోటుగాళ్ళు ఎప్పుడు పొట్టిగుంటారోయ్
సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసావా
ఫేసే ఫెయిర్ గుంది సున్నంగాని కొట్టావ
బాడీ వేడిగుంది ధర్మామీటర్ తేచ్చావ
ఇస్తా వచ్చేయి ఇలా చూస్తా నీ వేడినలా
అబ్బో వచేయి గురు జల్ది చేసెయ్యి శురు
ఇంతగా వేడిని తాకితే సుందరి ఔటేగా ధర్మామీటర్
దోస్కాయ్