ఒరేయ్ ఆంజనేయులు.. లిరిక్స్
అయ్యోలు.. అమ్మోలు..
ఇంతేనా బ్రతుకు హొ.. హొ.. హొ..
ఆహాలూ.. ఓహొలూ…
ఉంటాయి వెతుకు.. హ.. హ.. హ…
నువ్ ఆకాశానికి చిల్లెట్టేంత డేంజరువా..
స్పెసంతా ఇరుకైపోయేటంత ట్రాఫిక్కువా…
నీకోసం పుట్టాయా.. లోకంలో అన్ని కష్టాలు..
నీ వల్లే వస్తాయా.. ప్రళయాలు విశ్వ విలయాలు…
భయం లేదు శిశువా.. ఇసుక తునకంత లేవే నువ్వసలు..
నువ్వేం చేయగలవా.. అష్ట దిక్కుల్ని వణికించే పనులు…
ఎవరెస్టును తొక్కేస్తాయా మన ఈ పాదాలు..
పసిఫిక్కుని ఇంకించేస్తాయా.. నీ పంథాలు…
ఆటమ్ బాంబు వేశావే.. భూగోళం పేలిపోయిందా..
గనులెన్నో తొవ్వావే.. పాతాళం కాని తగిలిందా…
న న న్నా.. న న న్నా.. న న న్నా….
ఒరేయ్.. ఒరేయ్ …
ఒరేయ్ ఆంజనేయులు.. తెగ ఆయాస పడిపోకు చాలు..
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు.. భవసాగరాలు…
కరెంటు, రెంటు, ఎట్సెట్ట్రా.. మన కష్టాలు..
కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్లు…
నైటంతా దోమలతో.. ఫైటింగే మనకు గ్లోబల్ వార్..
భారీగా.. ఫీలయ్యే టెన్షన్లేమ్ పడకు గోలీమార్…!