Anand (2004)

చిత్రం: ఆనంద్ (2004)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: లక్కీ ఆలి
నటీనటులు: రాజా, కమిలినీ ముఖర్జీ
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాత: శేఖర్ కమ్ముల
విడుదల తేది: 15.10.2004

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు
ఏ ఈ ఐ ఒ యు
అన్ని ఐ లవ్ యు
లవ్ యు లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు

ఎదనె నీవు నిదరె లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె
కునుకె రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లె
అడిగా నిన్ను వరమిస్తావా
విడిగ నన్ను వదిలేస్తావా
ఎస్సా నోవా ఎస్సా నోవా
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు

ఫ్లవరై విచ్చి కలరె ఇచ్చి వికసించావు తొలి ఊహల్లొ
చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడి జాముల్లొ

క్షణమె నేను యుగమౌతావ
సఖివై నాకు సగమౌతావ
ఎస్సా నోవా ఎస్సా నోవా
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు
ఏ ఈ ఐ ఒ యు
అన్ని ఐ లవ్ యు
లవ్ యు లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు
చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు

********  *********  **********

చిత్రం: ఆనంద్ (2004)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , చిత్ర

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

కట్టుకథలా ఈ మమతే కలవరింత
కాలమొకటే కలలకైనా పులకరింత
శిల కూడా చిగురించే విధి రామాయణం
విధికైనా విధి మార్చే కథ ప్రేమాయణం

మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ

మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగా వర్ణాలలో అలజడిలో

శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో
శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన ఊసులు
మూగే మనసులో అవి మూగవై
తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్న వేళలోన  శ్రీగౌరి
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో
ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

********  *********  **********

చిత్రం: ఆనంద్ (2004)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , చిత్ర

యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం… సంధ్యా రాగం…

ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ
పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మనసు కథా
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మనసు కథా
యమునా తీరం… సంధ్యా రాగం…

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ
చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మధుర కథా
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మధుర కథా
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం… సంధ్యా రాగం…

********  *********  **********

చిత్రం: ఆనంద్ (2004)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయా గోషల్

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా…
గాలి వాన లాలి పాడేస్తారా….

పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన
చదువు బాధనే తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వానతో కూడీ… వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డి డ్డి…… తొడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకు మనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడిసినవి నీటి కోంగులో
శ్రావణ మాసాల జల తరంగం
జీవన రాగాల కిది ఓ మృదంగం

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

కోరి వచ్చిన ఈ వాన.. గోరు వెచ్చనై నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే.. ముద్దు లాటలే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు.. తడిసే తడిసే పరువాలు
గాలి వానలా పందిళ్లు… కౌగిలింతలా పెళ్లిల్లు
నెమలి ఈకలా ఉలికి పడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురు చూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం

కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తార బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తారా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
ఓ.. కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వాన లాలి పాడేస్తారా…

********  *********  **********

చిత్రం: ఆనంద్ (2004)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయా గోషల్, కె.యమ్. రాధాకృష్ణన్

నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..
సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా…
చేరువైన దూరమైన ఆనందమేనా…
ఆనందమేనా..ఆనందమేనా..

నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..

మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా..కన్నీరేనా..
ఆ..తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా..నీ రూపేనా..

చేరువైన దూరమైన ఆనందమేనా…
చేరువైన దూరమైన ఆనందమేనా…
ఆనందమేనా..ఆనందమేనా..
నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..

ఆ..కోయిలల్లే వచ్చి ఏదో
కొత్త పాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం..ఇది ఏ తాళం..
ఆ..మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే..నీ ప్రేమేనా..

చేరువైన దూరమైన ఆనందమేనా…
చేరువైన దూరమైన ఆనందమేనా…
ఆనందమేనా..ఆనందమేనా..
నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..

error: Content is protected !!