చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 1986
పల్లవి:
తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డానమెడతా
తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డానమెడతా
నన్నే పెళ్ళాడుతావ కన్నె చిలకా
పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
నన్నేలుకుంటావా గోరింకా
చరణం: 1
కోకిలమ్మ సన్నాయితో
నెమిలమ్మ మేజువానితో
కోకిలమ్మ సన్నాయితో
నెమిలమ్మ మేజువానితో
మారాకు మంచమేసి చిగురాకు చీరకట్టి
నాజూకు సారె పెట్టి నీ సోకు బుగ్గనెట్టి
రేయంత నెమరేస్తుంటే…
అందాల ఆవిరంత గంధాల కోటలైతే
మర్యాద చేసుకుంటాలే…
చిలకల కొలికికి పులకలు పుట్టి
తడిమిన చేతికి తపనలు పుడితే
పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
నన్నేలుకుంటావా గోరింకా
చరణం: 2
మందార మలి పొద్దులో…
చెంగావి చెంగు పూజలో…
మందార మలి పొద్దులో…
చెంగావి చెంగు పూజలో…
పగడాల పక్కమీద పరువాల తోడుపెట్టి
పాలంటి పొంగుమీద పచ్చా కర్పూరమేసి
అందాలు అందిస్తుంటే హోయ్
పెడవింటి సిగ్గులన్ని పొదరింట ముగ్గులేసి
కట్నంలా చేతికొస్తావా…
మరుడుకి నరుడుకి తెలియని దిస్తే
నరుడుకి వలపుల కానుకిస్తే
తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డానమెడతా
పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా
నన్నే పెళ్ళాడుతావ కన్నె చిలకా