Andala Rakshasi (2012)

చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: రాకేందు మౌళి
నటీనటులు: నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 10.08.2012

మనసు పలికే భాష ప్రేమ
మౌనమడిగే బదులు ప్రేమ
మరణమైనా తోడు ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ

గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ
రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ
ఆదియు అంతము లేని పయనం ప్రేమ
వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ
విశ్వమంతా ఉన్న ప్రేమ
ఇరుకు ఎదలో దాచగలమా

కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మెరుగదు ఈ ప్రేమ
దొరకదా వెతికితే కడలైన కన్నీట
తరమక దాహమే నీరల్లే ఓ ప్రేమ
నీడనిచ్చే వెలుగు తోడు
చీకటైతే ఏమి కాను

*********    *********   *********

చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: లక్ష్మి భూపాల్
గానం: సత్య ప్రకాష్, భార్గవి శ్రీధర్

వేదన శోధన ఊపిరాగే భావన
ద్వేషమా ప్రాణమా చేరువైతే నేరమా

ముళ్ళే ఉండని పూవులుండవా
కన్నీరుండని కళ్ళు లేవా
అలలుండని సంద్రముండదా
ఏ కలలుండని జన్మ లేదా

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో మరుజన్మకి ఆశతో

గమ్యమే లేదని తెలిసిన పయనమా
చీకటే లోకమా చుక్కల్లో సూరీడా ప్రేమా
భూమి పాతాళం లోతునా
పిచ్చివాడై స్వర్గాన్ని వెతకనా
ఉన్నా ఆకాశం అంచున
నువ్వు లేని నా కోసం బ్రతకనా

ప్రాణాలే పోతున్నా నిందించ లేకున్నా
నాలోనే నాతోనే నేనుండ లేకున్నా

గతమే తీయగా బాధించే హాయి లో లో
పరదా తీయగా కనిపించే నిజమిలా
ఎటు చూడను ఇరు వైపుల
ప్రణయాలే ప్రళయమై
వెంటాడితే ఎం చేయను నేనే లేనుగా
ఏ తీరం చేరాలి చుక్కానే లేకుండా
నాదంటు నాకంటు ఉందొకటే నరకం

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో…

*********   ********   *********

చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: వశిష్ఠ శర్మ
గానం: బోబో శశి

ఏ మంత్రమో అల్లేసిందిలా
యదకే వేసే సంకెలా
భూమెందుకో వణికిందే ఇలా
బహుశా తనలో తపనకా
ఆకాశం రూపం మారిందా
నా కోసం వానై జారిందా
గుండెల్లో ప్రేమై చేరిందా
ఆ ప్రేమే నిన్నే కోరిందా

మబ్బుల్లో ఎండమావే
ఎండంతా వెన్నెలాయె
మనసంతా మాయ మాయే
ఐనా హాయే

క్షణము ఒక ఋతువుగ మారే
ఉరుము ప్రతి నరమును తరిమే
పరుగులిక వరదలై పోయే కొత్తగ
ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే
పగలు వల విసిరె ఉహలె
మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా

కళ్ళల్లో కదిలింత కలగా కల కరిగిపోకలా
ఎదురయ్యే వేళల్లో నువు ఎగిరి పోకలా
ఓ మాయలా ఇంకో మాయలా
నన్నంత మార్చేంతలా
ఓ మాయలా ఇంకో మాయలా
నువ్వే నేనయ్యేంతలా వెన్నెల్లా…

*********   ********   *********

చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: హరిచరన్

శపించని నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇక పై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగ ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న
కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన
ఓ కాలమా నువ్వే ఆగుమా
తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లుంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా

గుండెలో చేరావుగ ఉచ్వాసలాగా
మారకే నిశ్శ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా
కలలతోనే కాలయాపన
నిజాల జాడ నీవె అంటు
మెలకువే కలే చూసే
ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే
ఏం చేయను నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్నా
కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే

Previous
Aata (2007)
error: Content is protected !!