చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: వి.రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, లత సేతుపతి
దర్శకత్వం: బాపు
నిర్మాత: యన్.యస్. మూర్తి
విడుదల తేది: 12.09.1973
పల్లవి:
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు
చరణం: 1
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం.. ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం
అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం.. అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం
ఈ గొణుగుచున్న ఘనులు.. కడు మూర్ఖ శిఖామణులు
సమూహ భోజనంబు… సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు… అహహ్హ ఏమనందు
చరణం: 2
అరె..హ ! ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు… ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు… ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప.. కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప
కాలమ్ము మారెనప్పా ఓ వెర్రివెంగళప్పా..
ఆలోచనలను పెంచు.. ఆవేశములను దించు
సమూహ భోజనంబు… సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు… అహహ్హ ఏమనందు
చరణం: 3
దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాట లేదు.. హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాటలేదు
సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు.. సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు
కోపాలు సర్దుకోండి… సాపాటు పంచుకోండి
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు… అహహ్హ ఏమనందు
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు… అహహ్హ ఏమనందు
******** ******** **********
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: బాలమురళీకృష్ణ
పల్లవి:
పలుకే బంగారమాయెరా… అందాల రామ.. పలుకే బంగారమాయెరా
అందాల రామ… పలుకే బంగారమాయెరా
ఖగరాజ గమన నీవే జగముల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే… పలుకే బంగారమాయెరా
అందాల రామ… పలుకే బంగారమాయెరా
చరణం: 1
లక్షాధికారులైనా లవణమన్నమే గాని
బంగారు కణికలు… మింగలేరను మంచి… పలుకే బంగారమాయెరా
అందాల రామ… పలుకే బంగారమాయెరా
చిన్ని నా బొజ్జకు… శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని.. అందరికుండాలనే.. పలుకే బంగారమాయెరా
అందాల రామ… పలుకే బంగారమాయెరా
చరణం: 2
బిరుదులు పదవుల మీద… పరనారి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న… ఎరుకే బంగారమాయెరా
అందాల రామ… పలుకే బంగారమాయెరా
పంచదారను మించే… పాలూ మీగడల మించె
పరమ మధుర నామస్మరణే మంచిదనే… పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా… అందాలరామ పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా
******** ******** ********
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ
పల్లవి:
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ… మము బ్రోవమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ… మము బ్రోవమని చెప్పవే
ఏకాంత రామయ్య నీ చెంతగా చేరి… చల్లంగ నీ ముద్దు చెల్లించు వేళ
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ… మము బ్రోవమని చెప్పవే
చరణం: 1
మీరూ ఈ గోదారీ తీరాన నడిచారు… కన్నీళ్ళు నవ్వూలు కలబోసుకు న్నారూ
ఆ కథను కాస్త గురుతు చేసుకొమ్మనీ… మా కష్టాలు కాస్త చూసిపొమ్మని
నువ్వయినా చెప్పవమ్మా రామయ్యకూ… ఆ అయ్యకూ
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ… మము బ్రోవమని చెప్పవే
చరణం: 2
మా రాజులు మంత్రులు మిమ్మడగ వచ్చేవారలే… మా బోటి దీనులు మీ కడకు వచ్చేవారలే
ఇంతొ అంతొ ముడుపు కట్టి అంతటయ్యను మాయచేసి
లక్షలో మోక్షమ్ముకోరే గడుసు బిచ్చగాళ్ళము.. వట్టి పిచ్చివాళ్ళము
ఆదుకొమ్మని పైకి చేదు కొమ్మని చెప్పవమ్మా రామయ్యకు.. మా అయ్యకు
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ… మము బ్రోవమని చెప్పవే
చరణం: 3
పులిని చూస్తే పులీ యెన్నడు బెదరదూ… మేక వస్తే మేక యెన్నడు అదరదూ
మాయరోగమదేమో గాని మనిషి మనిషికి కుదరదు
ఎందుకో తెలుసా తల్లీ… ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకొంటూ తిట్టుకుంటూ కొండకెక్కేవాళ్ళము… మీ అండ కోరే వాళ్ళము
కరుణించమని చెప్పవే మా కన్నతల్లి… కరుణించమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ… మము బ్రోవమని చెప్పవే
******** ********* ********
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి. రామకృష్ణ, జె. వి. రాఘవులు
పల్లవి:
మా తల్లి గోదారి చూపంగ దారి.. పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా.. భద్రగిరి మహిమలే విందామా… భద్రగిరి మహిమలే విందామా
ఏవిటోయ్ ఆ మహిమలు ?
శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా.. సుజనులారా… సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున పావన గోదావరీ తీరంబున… ఒకానొక గిరిని పరికించి,
దానిపై సుంత విశ్రమించినంత… ఆ కంధరమ్మొక సుందరపురుషాకృతి దాల్చి . . .ఏమనినాడనదా
ధన్యుడనైతిని ఓ రామా.. నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని ఓ రామా.. నా పుణ్యము పండెను శ్రీరామా
మేరుగిరీంద్రుని పుత్రుడను.. నీ రాకకు చూచే భద్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు.. నా శిరసున నెలకొన వేడెదనూ
కారుణ్యాలయ కామిత మీడేర్చ.. కలకాలము నిను కొలిచెదనూ
ధన్యుడ . . ధన్యుడ . . ధన్యుడనైతిని ఓ రామా… నా పుణ్యము పండెను శ్రీరామా
అని భద్రుడు ప్రార్థించిన . . స్వామివారేమన్నరనగా . . .
వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలయును
తదా ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను . . అని వెడలిపోయిరి
అంతట
వెడలిన రాముడు వెలదిని బాసి… ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి… కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి… కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరిచాడు . . రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు… శ్రీమద్రమారమణ గోవిందో హరి . .
చరణం: 1
కాని భూలొకమున భద్రుడు ఎన్నియుగము లైనా ఎదురు చూస్తూ
ఏ విధిముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా… వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శెలవిచిన పిమ్మట… మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా.. అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున… నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద… వచ్చెదనంటివి రామయ్యా… వరమిచ్చెదనంటివి రామయ్యా
అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా . .
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు . .
సంక్షోభమ్మునొందిరి . . అపుడు…
కదలెను. . శ్రీ మహావిష్ణువు కదలెను. . భక్తసహిషువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక.. శుభ శంఖచక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు… సుపర్ణుని భుజమైన ఏక్కకా
వడివడి కదలెను శ్రీమహావిష్ణువు … కదలెను. . భక్తసహిషువు . .
శ్రీమద్రమారమణ గోవిందో . . హారి
చరణం: 2
గజేంద్రమోక్ష సన్నివేశంబుకై వడి . . .స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా
తన వెంటన్ సిరి.. లచ్చి వెంట నవరోధ వ్రాతమున్.. దానివె
న్కను బక్షీంద్రుడు.. వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబునూ…
హుటాహుటిని రాగా.. తొందరయందు అపసవ్యంబుగా ఆయుధములు ధరించి . . స్వామి
వారు భద్రునకు దర్శనంబీయ ఆ భక్త శిఖామణి ఏమన్నాడు
ఏవరివయ్య స్వామి నేను నిన్నెరుగను… హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవునావు… నాటి రూపుచూప నమ్మగలను
అని భద్రుడుకోరగా… శ్రీమహావిష్ణువు తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను . .
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు… ఆ తీరుగనే చేతుల
నెల్చెను . . .భద్రుడు మహదానందబరితుడై
ఈ తీరుగనె ఇచ్చట వెలయుము… ఇనకులసోమా రామా
భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్ర లలామా . . శభాష్
అని విన్నవించగా స్వామివారు ఆ తీరు గనే వెలసిరి
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను… భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై . . .
చరణం: 3
ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన
పోకల దమ్మక్క అను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా . . .
ఆయన భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను
కోరి కనిపించావా కోదండరామయ్యా… గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా… గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
చక్రవర్తి కుమారుడా… ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా… విధివక్రించి నీకే వాసమ్ముకరువా
తాటాకు పందిరే తాటకాంతక… నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార విందులయ్యా…. నీకు విందులయ్యా
అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను…
తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న
ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించెననగా… ఏవిధముగానా . . అప్పుజేసి
తప్పు నాయనా… గోపన్న చరితము లోకవిఖ్యాతము
తదీయ సంస్మరణము మంగళదాయకము
రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ… మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా… రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ… మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం… మహిత మంగళం మహిత మంగళం
జై శ్రీమద్రమారమణ గోవిందో హరి:
******* ******** *******
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ, సుశీల
పల్లవి :
అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన.. గుబులౌతుందే
అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే.. తలచుకొంటె గుండెలోన గుబులౌతుందే
అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
చరణం: 1
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఉలికులికి పడేదానివే . . నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే
అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో . . ఊ
అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో
నెత్తి మీద మొట్టేదానినోయ్… నువ్వు మొట్టగానే సాచిపెట్టి కొట్టేవడినే
అబ్బోసి చిన్నమ్మా… ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ.. నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ
చరణం: 2
మలిసంజవేళలో మర్రిచెట్టు నీడలో…
మలిసంజవేళలో మర్రిచెట్టు నీడలో
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది..
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది
పిడుగుపడితె హడలిపోయావే.. నన్నతుక్కుని అదుకుమున్నావే
పిడుగుపడితె హడలిపోయావే.. నన్నతుక్కుని అదుకుమున్నావే
అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అదుముకుంటే విదిలించుకు . . పరుగుపుచ్చుకున్నావు
నాటినుండి నేటి దాక ఫికరులేకపోయావు
వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా
వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా
అబ్బోసి… చిన్నయ్య . . అబ్బోసి… చిన్నమ్మ . .
అబ్బోసి… చిన్నయ్య . . అబ్బోసి… చిన్నమ్మ . .
అబ్బో. . అబ్బో . . అబ్బో . . అబ్బో
******** ******** ********
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: వి.రామకృష్ణ
పల్లవి:
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ
ఆ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ
ఆ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
చరణం: 1
ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆనదు నీది
ఇంతకూ..
అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..ఊహు
పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉడికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది
ఏమిటది?
ఎవరమ్మా ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ
అంతేనా…
తిరగట్లే ఒరుసుకునే వరద గోదారిలా
పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ
ఆపైన
అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను
కానీ..
చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ
ఎవరమ్మా ఇతగాడెవరమ్మా
******** ******** ********
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ
పల్లవి:
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా…
ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ..
జోజో జోజో… జోజో జోజో…
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర
జోజో జోజో… జోజో జోజో…
చరణం: 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లురా
అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..అందుకే…
చరణం: 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి
అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ
పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అందుకే…
చరణం: 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే
ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో
పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగా
అందాకా…
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర
జోజో జోజో… జోజో జోజో…
టాటా టాటా… టాటా టాటా…