చిత్రం: అందాల రాముడు (2006)
సంగీతం: యస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఇ.యస్.మూర్తి
గానం: రాజేష్ , శ్రేయా ఘోషల్
నటీనటులు: సునీల్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: పి. లక్ష్మీనారాయణ
నిర్మాత: యన్. వి.ప్రసాద్, పరాస్ జైన్
విడుదల తేది: 11.08.2006
జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
నిన్నే కోరిందీ వెండి జాబిల్లి నీతోడై ఉంటానంది మనసిచ్చి
మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నాముందే ఉంటూ నమనసేదోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి
చరణం: 1
దూర దూర ఈడు తోడు లేక నేడు ఉసురుసురన్నది చూడు కోరిందే నీతోడు…
కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు రేగదామరి జోడు ఆగదే ఎద తూరు
నా వెంటె చెలి నీవుంటే ఇంకేవి కోరనులే
అవునన్నా నువు కాదన్నా నేనీలో సగమేలే
ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే
చరణం: 2
వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మపైడి పూల బొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు
బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే
నీ ఒడిలో గొప్పల్లె కలకాలం ఉంటాలె
************ ************ *************
పల్లవి
యే…రాజయోగం వచ్చిందయ్యో నీకూ…
యే… మంచిరోజులొచ్చాయిలే నేడూ…
కోరస్: రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడ రార రార
కోరస్: రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
చరణం: 1
పువ్వుల చొక్కా తొడిగా వంటే ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను
కళ్ళజోడు పెట్టావంటే సినిమా హిరోలాగే ఉంటావయ్య నువ్వు
గురువానీది ఆ సింహరాసి కాదా మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా
కోరస్: ఎందరెందరో మెచ్చినవాడు మా ఊరికే వచ్చాడు
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి
కోరస్: రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
చరణం: 2
అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్
ఇందాకడ్నించి మీరేంచేత్తన్నార్రా
మిమ్మల్ని పొగుడుతూ పాడతాన్నామండి
అద్ది అందికే దిష్టి తలిగి కిందడి పోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి
ఇప్పుడు తిడతాపాడండ్రా
కుదరదండి
ఏ
మిమ్మల్ని పొగుడుతూ పాడ్డానికే డబ్బులిచ్చారండి
ఓ…ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా
అయితే ఒకే తిట్టండ్రా
చరణం: 3
కోరస్: సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ
నువు పక్కనుంటె ఊరకుక్క చచ్చినంత కంపు
ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా నీ దిమ్మదిరిగి
దొంగకోళ్ళ చూపు చూడమాకు
హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక (2)
అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు
పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి
నిన్ను చెప్పుతోటి కొట్ట
పెంట నాయాల రేగోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి
నిన్ను చెప్పుతోటి కొట్ట
ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురా బాబు
మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం ఏసేతుందిరా
ఫస్ట్‌దే కంటిన్యూ అయిపోండమ్మా
అలాగలాగే పాడిండిరా