చిత్రం: అందరికంటే మొనగాడు (1985)
సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకులు: పుహళేంది
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, రోహిణీ కుమార్
గానం: యస్.పి.బాలు, కె.జె.యేసుదాస్, రమేష్ , కాకినాడ పుల్లారావు, యస్.జానకి , పి.సుశీల, వాణిజయరాం
నటీనటులు: కృష్ణ , జయసుధ
మాటలు: డి. ప్రభాకర్
స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: టి.కృష్ణ
నిర్మాత: ఎ. శ్రీరామ్ రెడ్డి
ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ
బ్యానర్: శ్రీ అజంతా సినీ ప్రొడక్షన్స్
విడుదల తేది: 05.10.1985
పల్లవి:
అడగనా మాననా అమ్మాయి
అడిగితే ఇస్తావా హాయి
అడగనా మాననా అమ్మాయి
అడిగితే ఇస్తావా హాయి
అడిగినా మానినా అబ్బాయి
ఎన్నడో కలిపాను చేయి
అడిగినా మానినా అబ్బాయి
ఎన్నడో కలిపాను చేయి
చరణం: 1
మగవాడు చేసేది ఏమిటి
వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది ఏమిటి
వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది అల్లరి
మగవాడు చేసేది అల్లరి
వగలాడి మురిసేది రాగ వల్లరి
అడగనా మాననా అమ్మాయి
అడిగితే ఇస్తాను హాయి
చరణం: 2
మగవాడు తలచేది ఏమిటీ
జవరాలు మరువనిది ఏమిటీ
మగవాడు తలచేది ఏమిటీ
జవరాలు మరువనిది ఏమిటీ
మగవాడు తలచేది కమ్మని కైపు
మగవాడు తలచేది కమ్మని కైపు
ప్రియురాలు మరువనిది ప్రియతమ రూపు
అడగనా మాననా అమ్మాయి
అడిగితే ఇస్తాను హాయి
చరణం: 3
మగవాడు కోరేది ఏమిటీ
ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ
మగవాడు కోరేది ఏమిటీ
ప్రియురాలు ఇచ్చేది ఏమిటీ
మగవాడు కోరేది ఆనందం
మగవాడు కోరేది ఆనందం
ప్రియురాలు ఇచ్చేది మెచ్చేది అనుబంధం
అడగనా మాననా అమ్మాయి
అడిగితే ఇస్తావా హాయి
అడిగినా మానినా అబ్బాయి
ఎన్నడో కలిపాను చేయి