Andarivaadu (2005)
Andarivaadu (2005)

Andarivaadu (2005)

చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: మల్లికార్జున్ , సుమంగళి
నటీనటులు: చిరంజీవి, టబు, రిమీ సేన్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 04.06.2005

హో పడుచు బంగారమ పలకవె సరిగమ
చిలిపి శృంగారమ చిలకవె మదురిమ
మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం
నిను చూసె తరుణంలో తనువంత బృందావనం…
నీ చెంత నే వాలి చెప్పుకొవాలి నువ్వు కావాలని
నిను చేరుకొవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని

అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లో
ఎండలేంటి హొయిలాలో
అరె నీలొ నాలొ లోలో
వేడి పుట్టింది ఈడు గాలిలో హొయ్

హో నా కలలో తొలిగ మలిగ చలిగ గిలిగ
కలిగె వలపే ని కంటి కాటుతో
నా ఎదలో సొదగ రొదగ అదిగ ఇదిగ
ఎదిగె తలపే నీ పైట వేటుతో
చెమ్మ చెక్క రోజునుంచి బుగ్గ చుక్క రోజు దాక
ఇంత మోజు దక్కలేదు ఏంటంట
నన్ని నువ్వు రాజుకుంటె లోన నిప్పు పుంజుకుంటె
మోజు రాక ఉరుకుంటదా…
ఒలికేటి వయ్యర మంట మొయ్యాల నేటి సయ్యాటకి
పద కొంటె కయ్యాల జంట ఉయ్యాలలూగాలి ఈ రేయికె

అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లో
ఎండలేంటి హొయిలాలో
అరె నీలొ నాలొ లోలో
వేడి పుట్టింది లేత ఈడులొ హొయ్

హో పడుచు బంగారమ పలకవె సరిగమ
హో చిలిపి శృంగారమ చిలకవె మదురిమా

ఈ కథలొ పగలె వగలె పొగల సెగల
రగిలే సరిగ సరసాల వేలలో
నీ జతలొ లతగ సతిగ రతిగ అతిగ
వతినే మరిచా మునిపంటి గోలలో
కల్లబొల్లి మాట దాటి అల్లిబిల్లి ఆట తోటి
అల్లుకున్న అశ తీరదేంటంట
బెల్లమంటి బుల్లి గుంట కల్ల ముందు
జల్లు మంటె ఆశ కంటు అంతు ఉంటదా
కొల్లెటి కోటల్లొ కొటి ఘాటుల్లొ వాటమె ఉందిలె
ఈ మంచు మీటుల్లొ మబ్బు చాటుల్లొ
మొమాటమె వద్దులె

అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లో
ఎండలేంటి హొయిలాలో
అరె నీలొ నాలొ లోలో
వేడి పుట్టింది ఈడు గాలిలో హొయ్

హో పడుచు బంగారమ పలకవె సరిగమ
హో… చిలిపి శృంగారమ చిలకవె మదురిమ

****    ****    **** 

చిత్రం: అందరివాడు (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె , సునీత సారథి

FTV చిరంజీవి