చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: టిప్పు, స్మిత
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , ప్రభుదేవా, అంకిత , కిరణ్ రాథోడ్, నాగబాబు
దర్శకత్వం: నిధి ప్రసాద్
నిర్మాత: హర్షా రెడ్డి
విడుదల తేది: 18.06. 2004
పల్లవి:
కన్నె తనం వన్నెతనం గుప్పుమనే సుందరి
గుండెనరం ఎందుకిలా లాగుతున్నది
వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
దాదా దామిని సోకుల చింతామణి
కాదా నెచ్చెలి అందాల ఆకలి
నవ్వే పాలపిట్ట నీ సొగసు పూలబుట్ట
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా
వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
చరణం: 1
పండువెన్నెల్లో కొనసాగించారా
చెంతకు చేరి నే కాదంటానా
తేనె రాసుకో గోరంటు చేసుకో
బుగ్గే ఇచ్చుకో వదలను ఇంకా
అగ్గై కోరిక రేగింది చూడిక
వయసే ఆపేది ఎన్నాల్లింక
వడిసి పట్టేయన చూసేయన ఎగాదిగా
ముగ్గే పెట్టేయనా బంధానికె పునాదిగా
త్వరగా వచ్చేయన సయ్యాటకు రవ్వల జాణ
వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
కన్నె తనం వన్నెతనం గుప్పుమనే సుందరి
గుండెనరం ఎందుకిలా లాగుతున్నది
చరణం: 2
పాలకన్నుల్లో నా సొగసరి జాణ
దాచుకున్నావే నే చూసిన చాన
పోరా పోకిరి చాల్లే నీ అల్లరి
గేలం వెయ్యకు మాటలతోటి
వస్తా సుందరి అందంగా రాపిడి
చేస్తా చూసుకో వయసును మీటి
చూపుతో వయ్యారంగా సోదాచెయ్యి అందాలన్నీ
దొరలా సుకిస్తాగా అందించవే సింగారాన్ని
అందుకో వయ్యారాలు ఆరేసింది ఈ అలివేణి
కన్నె తనం వన్నెతనం గుప్పుమనే సుందరి
గుండెనరం ఎందుకిలా లాగుతున్నది
వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
దాదా దామిని సోకుల చింతామణి
కాదా నెచ్చెలి అందాల ఆకలి
నవ్వే పాలపిట్ట నీ సొగసు పూలబుట్ట
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా హేయ్…