చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌశల్య
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, రక్షిత
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: గిరి
విడుదల: 02.01.2004
మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్
పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోంది రోయ్
హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడి పెంచమాకురోయ్
అంతో ఇంతో నే ట్రై చేస్తా
ఎంతో ఇంతో రూటుకు తెస్తా
నాతో నాతో లేపుకుపోతా
లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది
అల్లుకోకురోయ్ అలలా గిల్లి పోకురోయ్
అగ్గిపుల్లవై నాలో భగ్గు మనకురోయ్
నడక చూడరోయ్ ఆ నైలు నదిరోయ్
తాకి చూడరోయ్ నాజూకు వెన్నరోయ్
అమ్మతోడు ఆగలేనురోయ్
హే స్పీడు చూడరోయ్ ముంబాయి రైలురోయ్
చూపు చూడరోయ్ గుండెల్లో ముల్లురోయ్
హత్తుకుంటే పట్టులే హోయ్
హోయ్ గుమ్మా గుమ్మా గుమ్మసోకు
నే ఆడేసుకుందునా ఆడసోకు
రెమ్మ రెమ్మా తుంచమాకు హే ఆటాడుకుందాం హోయ్
హే పాతికేళ్ల పోరి వద్దకొస్తావా
అద్దుపెట్టకుండా ముద్దులిస్తావా
చీకటైనాక ఇంటికొస్తావా
నిన్ను కౌగిట్లో కుమ్మేసుకుంటా
మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్
హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్
తళుకు తళుకుల కిలాడి నువ్వురోయ్
చమకు చమకుల గులాబి నేనురోయ్
లిప్పు లిప్పు లింకు చెయ్యరోయ్
పాల బుగ్గలను పట్టేసుకుంటా
ముద్దు కుంపటి పెట్టేసుకుంటా
బుగ్గమస్తు రెడ్డుగుందిలే
మావా మావా లాగమాకు
నన్ను మొత్తంగ ముగ్గులోకి దించమాకు
భామ భామ పాల గ్లాసు
ఇక పంచేసుకుందాం హోయ్
ఓర చూపు తోటి గిల్లమకురా
పంటిగాటు లేసి చంపమాకురా
నంగ నాచి పిల్ల నాడి పట్టన
నీ సోకంత కాజేసుకోన
మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్
పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోంది రోయ్
హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడి పెంచమాకురోయ్
అంతో ఇంతో నే ట్రై చేస్తా
ఎంతో ఇంతో రూటుకు తెస్తా
నాతో నాతో లేపుకుపోతా
లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది
******** ******* ********
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి
నైరే…
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
నేనే నేనే దిల్దారు వాల
నాలో చూడు దమ్ముంది జాణ
నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే
చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే
అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే
కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే
రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే
నైరే నైరే…
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
మీరే నవాల్లయ్య బాధలో తోడై ఉంటానురా
చెయ్యందిస్తానయ్య నేరుగా సాయం చేస్తాను రా
కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా
శత్రువుల గుండెలలో ప్రాణభయం నేను రా
తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి
బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి
మనసే పెట్టాలి చెలిమే కట్టాలి
మనిషై పుట్టాక కలిసి మెలసి ఉండాలి
నైరే నైరే…
నైరే నైరే నై నై రే బాబా
నేనే నేనే దిల్దారు వాల
మంచి చెడ్డేనురా సృష్టిలో రెండే కులాలురా
రారో నందామయా మంచితో జోడి కడదామురా
కష్టమని నష్టమని నువ్వు అలా ఆగక
గుప్పుమనే నిప్పు సెగై ఉవ్వెనలా మారవ
ఉరుమై పోవాలి మెరుపై రావాలి
పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి
చిరుతై దూకాలి భరతం పట్టాలి
ఎదురే లేదని గెలుపు దారి పోవాలి
నైరే నైరే…
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే
చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే
అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే
కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే
రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే
నైరే నైరే…
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
నేనే నేనే దిల్దారు వాల
నాలో చూడు దమ్ముంది జాణ
******** ******* ********
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
ఇంత వింతై ఇంత వింతై
ఇంత వింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడ లాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే…నీ చూపు నడిచేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నీ గుండెలో ఉంది ఉరిమే గుణం
నీ చేతిలో ఉంది పంచే గుణం
నీ వెంట సైన్యంలా కదిలే జనం
నీకోసమిస్తుంది నీరాజనం
నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా
ఎన్నడూ తల వంచక అలుసంది చెయ్యరా
ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా
మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా
హే…మాగుండెలో నువ్వు కొలువుండగా
ప్రతిరోజు మాకింక ఒక పండుగ
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
నేరాలు గోరాలు వెంటాడగా
మేమంత చేరాము నీ చెంతగా
కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా
చేయూత నిచ్చావు నీ వంతుగా
చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా
ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా
శోకమే తొలగించగా దేశమే పులకించగా
కోపమే గర్వించగా యువరాజులాగ రారా
హే… తెలుగోడు తేజాన్ని చూపించగా
ఎవడైన వెనకడుగు వేయాలిగా
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
ఇంత వింతై ఇంత వింతై
ఇంత వింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడ లాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే…నీ చూపు నడిచేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా
నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా