Andhrudu (2005)

చిత్రం: ఆంధ్రుడు (2005)
సంగీతం: కోడూరి కళ్యాణ్ మాలిక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె.
నటీనటులు: గోపిచంద్, గౌరి పండిట్
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్. ఎల్. కుమార్ చౌదరి
విడుదల తేది: 19.08.2005

ఓ సారి ప్రేమించాక
ఓ సారి మనసిచ్చాక
మరుపంటు రానే రాదమ్మా
ఓ సారి కలగన్నాక
ఊహల్లొ కలిసున్నాక
విడిపోయె వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా…
కన్నీటి జల్లుల్లోనా…
ఆరాటాలె ఎగసి అనువు అనువు తడిసి
ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా
ఓ సారి ప్రేమించాక
ఓ సారి మనసిచ్చాక
మరుపంటు రానే రాదమ్మా

చరణం: 1
అనుకోకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రేమా
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా…

చరణం: 2
స్వార్ధం లేనీ త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా…
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా…
ఓ సారి ప్రేమించాక
ఓ సారి మనసిచ్చాక
మరుపంటు రానే రాదమ్మా
ఓ సారి కలగన్నాక
ఊహల్లొ కలిసున్నాక
విడిపోయె వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా…
కన్నీటి జల్లుల్లోనా…
ముత్యంలాగా మెరిసి సత్యాలెన్నొ తెలిపి
ముందుకు నిన్నే నడిపింది ప్రేమా

********  *******   ********

చిత్రం: ఆంధ్రుడు (2005)
సంగీతం: కోడూరి కళ్యాణ్ మాలిక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయగోషల్

కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన..
ఆశాలతాలలోన జనించు తేనె సోన..వినేసి తరించి..తలొంచుకెళ్ళవమ్మా..
కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..

కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..

ఒకే పదం ..ఒకే విధం ..కహ..కహ..ఆ..ఆ..
అదే వ్రతం అదే మతం అనుక్షణం ..
నా వీణ రాగముంది..ప్రవాహ వేగముంది..అనంత గీతముంది ..అసాధ్య రీతి ఉంది..
చేరవమ్మా..చరిత్ర మార్చుకోమ్మా..శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ..ఖరీదు కాదులేమ్మ..

కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
కోకిలమ్మా..బడాయి చాలించు,మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన..
ఆశాలతాలలోన జనించు తేనె సోన..వినేసి తరించి..

మావిళ్ళలో..నీ గూటిలో ఎన్నాళ్ళిలా..ఆ..ఆ..
మా ఊరిలో కచేరిలో పాడాలిగా..హా.హా..
చిన్నరి చిలక పైన సవాలు చేయకమ్మా..తూనీగ..తేనెటీగ..చప్పట్లు చాలవమ్మ..
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా..అదంత తేలికేం కాదులేమ్మ..ఎత్తాలి కొత్త జన్మ

కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
కోకిలమ్మా..బడాయి చాలించు మా సుశీల జానకమ్మా..స్వరాలు నీలో లేవమ్మా..
చలాకీ చిత్రలోన సుమించు ఛైత్రవీణ..వినీల జిక్కి లోన వర్షించు పూల వాన..
ఆశాలతాలలోన జనించు తేనె సోన..వినేసి తరించి..తలొంచుకెళ్ళవమ్మా..

********  *******   ********

చిత్రం: ఆంధ్రుడు (2005)
సంగీతం: కోడూరి కళ్యాణ్ మాలిక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..
మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా..
ఇలా ఇలా… నిరాశగా…
నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

చరణం :స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే …
కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే..
తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే..
ఎడారి లొ తుఫాను లొ
తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా…

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా..

చరణం :ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ..
మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే..
గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,
స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ..

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా..
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా.

********  *******   ********

చిత్రం: ఆంధ్రుడు (2005)
సంగీతం: కోడూరి కళ్యాణ్ మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్ , సాహితి

గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే
ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం
ఇక నిరంతరం మనసుతో మనం

గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే
ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం
ఇక నిరంతరం మనసుతో మనం

ఇన్నాళ్ళు ఎవరికి వారె ఏమి కారె
మరి ఏమైందొ ఏకం అయ్యారే
దూరాన్నె దూరం దూరం పోపొమ్మంటు
చిత్రంగ చేతులు కలిపారే
ఇది మనసు చేసిన ఓ వింత గారడి
కాబట్టె బంధం కుదిరిందే
ఇపుడె కద మొదలంట
దీనికి చివరేదంట తెలిసె వీలె లేదే

గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే
ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం

బంధుత్వాలన్ని దైవం ఇచ్చినవేలే
స్నేహాన్ని నువ్వె వెతికావే
త్యాగానికి అర్ధం వుంటె రానిస్తుందే
చెలిమయ్యి నిన్నల్లేసిందే
ద్వేషంతొ శ్రీకారం చుట్టింది ఈ బంధం
ఇంకెన్ని మలుపులు తిరిగేనో
కాలం గడిచేదాక తీరం చేరేదాక
తెలిసె వీలె లేదే

గుండెల్లొ ఏముందొ చెప్పేది కాదే ఆపేది లేదే
ఏ రోజేం చెయ్యాలొ ఆలోచిస్తుందే నీకంటె ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం
ఇక నిరంతరం మనసుతో మనం

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Mahanagaramlo Mayagadu (1984)
error: Content is protected !!