Anjali CBI (2019)

anjali cbi 2019

చిత్రం: అంజలి సి.బి.ఐ (2019)
సంగీతం: హిప్ హప్ తమీజ్
సాహిత్యం: బండారు దానయ్య
గానం: జతిన్ రాజ్
నటీనటులు: అనురాగ్ కశ్యప్, నయనతార, రాశిఖన్నా
దర్శకత్వం: ఆర్. అజయ్
నిర్మాత: సి.జె.జయకుమార్
విడుదల తేది: 22.02.2019

ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే

కొత్త కొత్త ఫేసుల్ని ఫ్రెండని చెప్పి
గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు వాళ్ళు
కొత్త కొత్త ఫేసుల్ని ఫేసుల్ని చెప్పి
గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు

ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే

తను నేను ఉన్నప్పుడు లవ్ ట్రాక్ సూపరు
పిడుగులాగా వచ్చే తన ఫ్రెండ్ ఒక జోకరు
చెప్పినా నువ్వు మారకుంటే చస్తావుర శేఖరు
నువు మారావా లైఫ్ కొంచం
మిగులునురా ఖాదరు
కష్టాలుంటాయ్ తనకుతానే
వచ్చి ఫిగరు దొరుకుతుంది
ఖాయం ఖాయం దొరకడము ఖాయం
మస్తు ఉంది ఫిగరు అని
ఫ్రెండ్ ఫిగర్ కి లైన్ వేస్తే
నీ ఫిగర్ కన్ఫర్మ్ గా జంపగుట ఖాయం

ఏమి ఖర్మరా  ఇది ఏమి ఖర్మ రా
ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా
సూన్యమేనురా అంతా సూన్యమేనురా
నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా

ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే

అందమైన పువ్వులిచ్చి చెప్పే ప్రేమని
ఇపుడు ఇంటర్నెట్లో టెండర్ పెట్టె తీరు రాంగమ్మ
సెల్ ఫోన్ వచ్చాక సొల్లు పెరిగెరా
నేడు ఫేసుబుక్ పబ్బులంటు ట్వీట్ మారెరా
ఏమి ఈ గతి భయమేస్తున్నది
వచ్చే వాళ్ళ పోయే వాళ్ళ ముద్దుపద్దులేమిటి
నీటుగా బ్రెయిన్ రా హార్ట్ లో కుదురుగా
అయ్యో అయ్యయ్యో ఎంత మాయ ప్రేమరా

ఏమి ఖర్మరా  ఇది ఏమి ఖర్మ రా
ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా
సూన్యమేనురా అంతా సూన్యమేనురా
నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top