చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, సునీత
నటీనటులు: చిరంజీవి, నమ్రతా శిరోడ్కర్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 15.01.2004
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
విన్నపాలనే ఆలకించిన అప్సర నేనేరా…
స్వర్గభోగమే నేల దించిన కిన్నెర నేనేరా…
ఇంద్రలోకమొచ్చి కళ్ళముందు వాలినా
ఎందుకంట ఇంత యోచనా
ఇంతదూరమొచ్చినాక ఇంకా
అందుకోవ సోకు సూచనా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
పక్కకొచ్చెనే… తిక్కపెంచెనే
పక్కకొచ్చెనే తిక్కపెంచెనే వయ్యారి నీ వాలకం
దిగ్గజాలనే… ధిక్కరించెనే
దిగ్గజాలనే ధిక్కరించెనే నరుడా నీలో సాహసం
మైకంలో ముంచుతున్నది పాపా నీ పనితనం
మోహంలో ముంచుతున్నది నరుడా నీ మగతనం
కొంటె కోరిక రెచ్చగొట్టకా చుక్కా చాలింక
వేడి వేడిగా జోడుకూడగా వచ్చా నీవంక
చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మా
సందేహిస్తే ఎల్లా ముందుకురావమ్మా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
తియ్య తియ్యగా… అందచేయనా
తియ్య తియ్యగా అందచేయనా
పెదవుల్లోని అమృతం
మత్తు మత్తుగా… ఊపుతున్నదే
మత్తు మత్తుగా ఊపుతున్నదే పిల్లో నన్నే నీనడుం
కౌగిల్లో వాలమన్నది ఊరించే ఉత్సవం
తందానా తాళమైనది చిందాడే యవ్వనం
సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీదెదొరా
ముద్దరాలితో ముద్దులాటలో మొక్షం పొందేలా
ఆనందం ఈపైనా నీదే అంటున్నా
ఏదేమైనా మైనా నీతోనే రానా
****** ****** ******
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, గంగ
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం (3)
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
ఓ ఓ – వెనక తిప్పిస్తాన్
ఓ ఓ – వణుకు తెప్పిస్తాన్
ఓ ఓ – వయసు నీపై గుప్పిస్తాన్
ఓ ఓ – మొదలు ఒప్పిస్తాన్
ఓ ఓ – ముడులు విప్పిస్తాన్
ఓ ఓ – పిదప నిన్నే మెప్పిస్తాన్
సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
కళ్ళు చూస్తె యమ పవర్ ఫుల్
కండ చూస్తె యమ వండర్ ఫుల్
కులుకులన్ని చేస్తాడే కాకెంగిల్ గిల్ గిల్ గిల్
పిల్ల చూస్తే యమ కలర్ ఫుల్
వళ్ళు చూస్తె యమ వంపుల్ ఫుల్
చూపుతోనే పెడుతుందే చెక్కిల్ గిల్ గిల్ గిల్
మాటతోనె చేసేస్తాడమ్మ మాయ మంత్రజాలాల్
కన్నుతోటి కొట్టేస్తాడమ్మ కాముడి కాలింగ్ బెల్
చిందులేసి లేపి రేపేసిందమ్మ మంత్రం తంత్ర గోళాల్
కునుకు మాని కుసేసిందమ్మ కసి కసి కొక్కర కోల్
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం (2)
వయసు చూస్తే ఇక ట్వంటీ వన్
బరువు చూస్తే ఇక ఫిఫ్టీ వన్
పనులు మాని నీతో చేస్తా ఫన్ ఫన్ హే ఫన్
స్పీడు చూస్తే ఇక ఫైట్ ఇంజన్
వేడి చూస్తే ఇక ఫైరింజన్
అందువల్ల అయ్యాలే నీకే ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్
చెంత కొస్తే ఇక వేసేస్తాలే చాకులాంటి ఫోకాల్
సోకులన్ని తీసేస్తాలే చక చక సిటి స్కాన్
రాతిరైతే ఇక తప్పక నీకే రణివాసమిస్తాన్
రాజులేక ఇక చూపిస్తాలే ఇక గజిబిజి రాజస్థాన్
ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్
ఓ ఓ – వెనక తిప్పిస్తాన్
ఓ ఓ – వణుకు తెప్పిస్తాన్
ఓ ఓ – వయసు నీపై గుప్పిస్తాన్
ఓ ఓ – మొదలు ఒప్పిస్తాన్
ఓ ఓ – ముడులు విప్పిస్తాన్
ఓ ఓ – పిదప నిన్నే మెప్పిస్తాన్
సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్
ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం (2)