Ankit Pallavi & Friends (2008)

ankit pallavi friends 2008 movie songs

చిత్రం: అంకిత్ పల్లవి & ఫ్రెండ్స్ (2008)
సంగీతం: విను థామస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపు , గాయత్రి
నటీనటులు: నిఖిల్ , మేఘ బర్మన్
దర్శకత్వం: హరి ఎల్లేటి
నిర్మాత: కిషోర్ గంజి
విడుదల తేది: 2008

అరనవ్వెలెందుకో .. చిరు సిగ్గులెందుకో
తెరచాటు దేనికో చెలియా చెప్పుకో (2)

నీ కళ్ళలో కదిలే సంగతీ
చెప్పాలనే నీకూ ఉన్నదీ
ఏ బిడియమో మొదలైనదీ
ఏమో ఎలా అంటున్నదీ .. ఔనా !

Don’t you see my love
Don’t you care my love
Don’t you love me love
Won’t you tell me now !

వెళుతూ .. వెళుతూ .. అడుగే ఆగాలా
తిరిగీ .. తిరిగీ .. నన్నే చూడాలా
ఎదలో .. ఏదో .. ఉందనిపించేలా
కబురే .. చెబుతూ .. కాదనుకోవాలా

నీడల్లే నీతోనే ఉంటున్నా
వేరేగా చూస్తావేవంటున్నా
స్నేహంగా నిన్నే అడిగేస్తున్నా
నీలో ఏ మూలో నేను లేనా

తెలిసేలా లవ్ యూ అంటే విందామనుకున్నా !

Don’t you see my love
Don’t you care my love
Don’t you love me love
Won’t you tell me now !

అడిగీ .. అడిగీ .. అలుసైపోయానా
ఎదిగీ .. కలలో .. నలుసైపోయానా
మనలో .. మనకీ .. మోమాటాలేనా
మనసే .. కదిలీ .. మౌనం కరిగేనా

ఏకాంతం నన్నే చూపిస్తున్నా
ఏనాడూ అనవే ఏ మాటైనా
ఏ కొంచెం నాపై ప్రేమే ఉన్నా
ఈ నిమిషం బదులిస్తావనుకోనా !

ఓ ఓ ఓ హో .. love you .. I love you !
I just see your love
I do care your love
I do love you love
I do tell you now !

*********   *********   *********

చిత్రం: అంకిత్ పల్లవి & ఫ్రెండ్స్ (2008)
సంగీతం: విను థామస్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తిక్

లేలేత పువ్వులే .. ఈ లేడి కూనలు
మా కంటి పాపలే .. ఈ చంటి పాపలు
ట్వింకిల్ ట్వింకిల్ తారలే .. కన్నుల్లో కాంతులూ
ఈ బోసి నవ్వుల్లోనా .. వేవేల వర్ణాలు
నా గుండె లోతుల్లోనా .. ఎగిసే పాటలూ !

ఆకాశం హరివిల్లేదో వేస్తున్నా
చిందే ఈ నవ్వులకూ చిన్నబోయెనా
ఆ కోయిల రాగాలే తీస్తున్నా
పలికే పసి గొంతులకూ వెన్ను చూపెనా

రేపటీ .. స్వప్నమే .. చూసే కళ్ళలో
లోకమే తమదనే .. దృశ్యం చూపుదాం !
ఓ నమ్మకాన్నే రాద్దాం .. ఈ చిన్ని గుండెలో
ఆ ఆశే దూసుకుపోదా నింగే హద్దంటూ !

ఉరికే ఆ నదులన్నీ క్షణమైనా
తోడెవరూ లేరంటూ ఆగిపోవుగా
వెలిగే ఆ సూర్యుడే కలనైనా
చిదిమే ఈ చీకటిలో ఉండిపోడుగా

పాడుకో .. ప్రతిక్షణం .. బ్రతుకే పాటగా
ఉదింగా .. జీవితం .. నీతో పాటుగా

నీ తోడు నువ్వై సాగి చేరాలి గమ్యమే
ఆ గెలుపు నడిచొస్తుందిక నీతో నీడల్లే !

*********   *********   *********

చిత్రం: అంకిత్ పల్లవి & ఫ్రెండ్స్ (2008)
సంగీతం: విను థామస్
సాహిత్యం: వనమాలి
గానం: కారుణ్య , గాయత్రి

మనసే హే హే .. నిదురలేచే
వయసే హే హే .. పరుగు తీసే

కళ్ళల్లో రోజూ కలలు కదలనీ .. నిన్నే నాలో కలపనీ
గుండెల్లో చెరగని గురుతవ్వాలనీ .. గువ్వై నీలో వాలనీ
అడగనా ఈ మనసు మలుపులో .. కొలువు తీరమనీ

ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ

చినుకులా జారి నీలో .. కడలిగా మారిపోనా
చూపునై వాలి నీలో .. కలలుగా మేలుకోనా
నమ్మలేని ఈ వింత అలజడీ .. నాకు మాత్రమే కలిగెనా
చిన్నమాటకీ మనసు తడబడీ .. చిటికె వేసి నిను పిలిచెనా

మౌనాన్ని దాటి నిను చేరి జంటగా గొంతు కలపమన్నా !

ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ

ఎదను మాని ఏ పిలుపూ .. పెదవి అంచుకే రాదే
నీవు లేని ఏ వైపూ .. అడుగు ముందుకే పోదే
కంటి రెప్పకీ విసుగు పుట్టదా నిన్ను దాచగా ప్రతి క్షణం
గుండె సైతమూ చోటు చాలక అలక పూనదా అనుదినం

తన నీడలాగ నే సాగి పోవు ఓ వరము కోరుకోనా !

ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ
ప్రేమనీ ప్రేమనీ .. ప్రేమని ప్రేమనీ !

*********   *********   *********

చిత్రం: అంకిత్ పల్లవి & ఫ్రెండ్స్ (2008)
సంగీతం: విను థామస్
సాహిత్యం: వనమాలి
గానం: ప్రణవి, బాలు తంకచ్చన్

అలగకే అల్లరి వయసా .. అతనిపై ఇకనైనా
చెలిమినే కోరిన మనసా .. చేరవే తనలోనా
కోపమా నాపైనా !

నా మనసు నీదని మరిచా .. వీడకే కలనైనా
తుదకిలా మోడై నిలిచా .. కరగవే కాస్తైనా
చూపవే నాపై ప్రేమా !

ఇన్నినాళ్ళు నా పయనంలోనా .. గమ్యమొక్కటే ప్రేమనుకున్నా
వేకువల్లే దారి చూపు నిను విడిచానా
నన్ను దాచినా దాగని తపనా .. ఉన్నపాటుగా ఈ ఎదలోనా
వెల్లువాయె పంతమేదో తాకుతు ఉన్నా

కాలమెంతగా గాలమేసినా
చిన్ని గుండెలో ఆశ జారునా
నీడై సాగి నీతో రానా .. ప్రేమే దోబూచులే ఆడినా !

అలగకే అల్లరి వయసా .. అతనిపై ఇకనైనా
చెలిమినే కోరిన మనసా .. చేరవే తనలోనా
కోపమా నాపై ఇంకా !

గువ్వలా నువ్వుంటే .. రెక్కలే అడిగానా
పంజరంలో ఉంచీ .. ప్రేమ అనుకున్నానా
నీ కలకి కాస్తైనా .. నీడలో రాలేనా
నా కనులనే విడిచీ .. నన్ను చూస్తున్నానా
నిజమే తెలిసీ నిలిచానా .. నీలోనా !

నా మనసు నీదని మరిచా .. వీడకే కలనైనా
తుదకిలా మోడై నిలిచా .. కరగవే కాస్తైనా
చూపవే నాపై ప్రేమా !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top