• Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Chiranjeevi

Annayya (2000)

A A
3
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest

MoreLyrics

Ooo Narappa Song Lyrics

Chalaaki Chinnammi Song Lyrics

Acharya (2021)

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుక్విందర్ సింగ్, రాధిక
నటీనటులు: చిరంజీవి, సౌందర్య
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: కె.వెంకటేశ్వర రావు
విడుదల తేది: 07.01.2000

ఆటకావాలా పాటకావాలా
స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా
ఆటకావాలి పాటకావాలి
గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అదినా హాబీ
ఊపే ఊల్లే – చేసేయ్ డ్రిల్లే
భూగోళం అదిరేలా కదం తొక్కాలె

స్వీటుకావాలా హాటుకావాలా
నాణ్యమైన నాటుచికెన్‌ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి
రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి

చరణం: 1
ఝులుకు ఝులుకు కులుకులతో మెరిసే ఓ పోరీ
నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించే పోరీ
చూపులతో నా మనసును గుచ్చేశావే నారీ
ఇటు చూస్తే మనసాగునంటే ఆయాం వెరీ సారీ
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతోంది దిల్‌దే బేబే
మండపేట కుర్రదాన్ని ఓ బావయ్య
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యా
ఓకే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ

చిప్స్ కావాలా లిప్స్ కావాలా
గరం గరం సింగపూరు పప్సు కావాలా
చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ
అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ

చరణం: 2
కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది
ఈ డ్రెస్సుతోటి రావాలంటే సిగ్గేస్తుందీ
పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టిపట్టు పట్టనిస్తావా జూకామల్లి
అయితే రెడీ పట్టేయ్యి గిలీ
కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ
దిండు కావాలా దుప్పటి కావాలా
నైట్ లైటు లండన్‌ ఫోం బెడ్డుకావాలా
దిండు కావాలీ దుప్పటి కావాలీ
రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అదినా హాబీ
ఊపే ఊళ్ళే – చేసేయ్ దిళ్ళే
భూగోళం అదిరేలా కదం తొక్కాలే

స్వీటు కావాలా హాటు కావాలా
నాణ్యమైన నాటు చికెన్‌ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి
మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలి

********   *********    *******

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర, యస్.పి.బి.చరణ్

బావా చందమామలు మరదళ్ళు
వీరె ఇంటికి మణి దీపాలు
గుణంలో మేలిమి బంగారు
పనుల్లో ఎవ్వరు సరిపోరు
మావాళ్ళ ముందర మీవాళ్ళు
నిజంగా తేలిపోతారు

భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరె భరత – లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు
నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు
నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మ నీకు కూడా
ఎవ్వరో ఆతడు ఎక్కడో ఉండటం చెప్పవయ్య వాడి జాడ
రాజాలా ఉంటాడే ప్రేమంటే వాడేలే
నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం
చక్కని వదినకి సయ్యనే అన్నకి వీడిపోని బంధమేస్తాం
ఊ అంటే కన్యా రత్నాలే  కానిస్తాం కన్యా దానాలే
వయ్యారి అక్కా-చెల్లెళ్ళే అవుతారు తోడి-కోడళ్ళే

ఆనందం – మీ అందం
సంగీతం – మా సొంతం

కొంగుతో కొట్టడం  పైటనే జార్చటం నచ్చినట్టు గుర్తులే లే
గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే
ఆ ప్రేమే స్వీకారం
నీకే నా సహకారం
అక్కలే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకోండి
ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ ఒక్కటిగ సాగిపోండి
భలేగ చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య
హనీమూన్ వెల్లండోరయ్య చెయ్యండి నన్ను తాతయ్య

భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరె భరత – లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు
నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు
నా రెండు కళ్ళు తమ్ముళ్ళు

********   *********    *******

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

గుస గుసలె గున్నా మామిల్లో
అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో
చిటికెడులే చిరు ముద్దుల్లో
అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో
య య సౌందర్య ఇది నిజమా మాయా
అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య
ఎద కొరిగి ఎన్నో బింకాల
రుచి మరిగి ఇంకా ఇంకాల
హొయ్ చెమటలతో చెంగే పట్టాల
హొయ్ సుఖ పడుతూ కట్టే సుఖాల

గుస గుసలె గున్నా మామిల్లో
అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో

కడవ చిన్న నడుము కున్నా కదలిక లెన్నో
కని దులుపు కుంటాడే అదే వలపు అన్టాదె
ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే
ఏదో దరువేస్తుంది తానే దరికొస్తుంది
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకే అని సయ్యన్నట్టే
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకే అని సయ్యన్నట్టే
చెలి సలహా పస్తే నంటాడు
చలి విరాహా లొస్తాయంటాడు
అది మినహా అన్ని తయారి
అబ్బా కలహాలా కన్యా కుమారి

నడక భలే నెమలివలే ఒడికొస్తూనే
ప్రియా తినిపిస్తుంది లయే కలిపేస్తుంది
మురళి వలె స్వరములిల వాయిస్తూనే
బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు
తగునా ఓ మదన ఈ తగువంటుంటే
తగనా ఓ లలనా నీ జతకంటాడు
తగునా ఓ మదన ఈ తగువంటుంటే
తగనా ఓ లలనా నీ జతకంటాడు
చలి పడితే సలామ్ ఆలేకుం
సెగ పుడితే జళాభిషేకం
మసకేస్తే మరో ప్రపంచం
ఉడూకేస్తే ఉయ్యాల మంచం

గుస గుసలె గున్నా మామిల్లో
అన్ని రుస రుసలే కన్నే చూపుల్లో
చిటికెడులే చిరు ముద్దుల్లో
అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో
య య సౌందర్య ఇది నిజమా మాయా
అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య
ఎద కొరిగి ఎన్నో బింకాల
హేయ్ రుచి మరిగి ఇంకా ఇంకాల
హొయ్ చెమటలతో చెంగే పట్టాల
హొయ్ సుఖ పడుతూ కట్టే సుఖాల

********   *********    *******

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య
అరె సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య
పెంచింది నన్ను మీ అభిమానము
మీ తోడై ఉంటాను కలకాలము
సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో

హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య

చరణం: 1
అన్నా తమ్ముళ్ళ ఈ అనుబంధమూ
ఇలలో అందరికీ అది ఆదర్శము
లోకం నాలోకం ఇక మీరేనురా
ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా
వేళ్ళు ఒక్కటైతే అది ఉక్కు పిడికిలిరా
అందరొకటైతే అది అగ్గిపిడుగేరా
అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే

హే సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య

చరణం: 2
మీరే నా కళ్ళు ఇక ఏ నాటికీ
మీరే తమ్ముళ్ళు ఏజన్మకీ
ఎపుడూ తీరని మీ ఋణమన్నదీ
దైవం తెచ్చాడు ఈ వరమన్నదీ
అన్న కన్నుల్లో వెలిగేటి దివ్వెలివి
అన్న గుండెల్లో పూచేటి పువ్వులివి
నామాటే వేధంగా నడిచేటి తమ్ముళ్ళంటే మీరే

హొయ్ సయ్యారే సయ్యా నేనేర అన్నయ్య
భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్య
పెంచింది నన్ను మీ అభిమానము
మీ తోడై ఉంటాను కలకాలము
సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లాపంలో

********   *********    *******

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, హరిణి

హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే

హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే

చరణం: 1
సోసో కాని సోయగమా ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వా వా అంటే వందనమా అభివందనమా
వయసంత నందనమా
మొహమాటమైన నవ మోహనం
చెలగాటమైన తొలి సంగమం
మది వదిలే హిమ మహిమ ఓ…
అది అడిగే మగతనమా నీదే భామ
పడుచు పంచదార చిలక పలుకగనే

హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో

చరణం: 2
మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి
సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం
రవి కలనే రచన సుమా  ఓ…
సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ ఇతిని చదవగనే

హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో
మునిమాపుల్లో ఎల్లో మురిపాలాలో ఎల్లో
చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా అందాలారబోశా
అలకలూరి రామచిలక పలుకగనే

********   *********    *******

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, సుజాత

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా
కోరస్: సామిరంగా
ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా
కోరస్: సామిరంగా
ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే

చరణం: 1
ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్

తారా రారా రారా (2)

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా
కోరస్: సామిరంగా

చరణం: 2
వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
అమ్మదొంగా సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా

తూరు రురు తూరు రురు (2)

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా
కోరస్: సామిరంగా
ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా కోరస్: సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

Tags: 2000AnnayyaChiranjeeviMani Sharma
Previous Post

Surya son of Krishnan (2008)

Next Post

Devudu Chesina Manushulu (2012)

Next Post

Devudu Chesina Manushulu (2012)

Comments 3

  1. 9133663496 says:
    1 year ago

    222222

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

You cannot copy content of this page