Antahpuram (1998)

చిత్రం: అంతః పురం (1998)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్
నటినటులు: జగపతిబాబు, సౌందర్య, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, దాసరి అరుణ్ కుమార్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: పి.కిరణ్
విడుదల తేది: 30.11.1998

వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షి
పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డా కక్ష కడిగింది మా ఆడబిడ్డా కసితీరే వేళ

సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
కోరస్: సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!
హే అశ్శరభా దరువెయ్ దశ్శరభా!
మనమియ్యాలా…
కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
కోరస్: తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!

చరణం: 1
కారం తిన్న కండలివీ..! రగతం మరిగే కత్తులివీ
మీసం దువ్వే దమ్ములివీ  రోషం రగిలే రొమ్ములివీ
ఎవరైనా రానీ,  కో: ఓ ఓ ఓ
ఏవైనా కానీ,  కో: ఓ ఓ ఓ
నీ సేవలోనే,  కో: నీ సేవలోనే
మేమున్నాం సామీ…!! కోరస్: మేమున్నాం సామీ
మనసు కలిసెనంటే ఉసురైనా ధార పోస్తాం
మనసు విరిగెనంటే మరి ఊరుకోం
హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!

చరణం: 2
అది అహోబిలం మనకున్న మహాబలం కాదా!
పెరిగే తాపం నరికే నరసిమ్హుడా
శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా
కోరస్: మనమా దొరకి భటులం అయ్యాం కదా
బ్రహ్మం గారి జ్ఞానం…!! కోరస్: వేమన వేదం
అందించిన పుణ్యం… కోరస్: మనకే సొంతం
నా నా నా ఆ నా నా
ఈ రతనాల సీమ …!!  కోరస్:  ఈ రతనాల సీమ
ఆ రాయల చిరునామా.!! కో: ఆ రాయల చిరునామా
కోరస్: ఏడుకొండల పైన కొలువైన యెంకటరమణ మనం పిలవగానే తనే దిగిరాడా
హే సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా
హే అశ్శరభా,  కో: అశ్శరభా దరువెయ్ దశ్శరభా…!! కోరస్: దశ్శరభా
మనమియ్యాలా…
కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా జాతర చెయ్యాలా రారే రారే
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా

********   *******   ***********

చిత్రం: అంతః పురం (1998)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

హే… నా ననననాన ననననాన ననననా
హే… నా ననననాన ననననాన ననననా

అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా

హే… నా ననననాన ననననాన ననననా
హే… నా ననననాన ననననాన ననననా

నా ననననాన ననననాన ననననా
నా ననననాన ననననాన ననననా

అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా??
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా??

ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ…
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ…
అల్లుకోమని గిల్లుతున్నది చల్చల్లని గాలి…
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి!!

ఏకమయే…
ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల!!

అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా??
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా??

ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ…
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ…
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మద్యన సన్నజాజులు హా హాకారం!!

మళ్ళీ… మళ్ళీ…
మళ్ళీ… మళ్ళీ… ఈ రోజు రమ్మన్నా రాదేమో!
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం!!

అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా
నీలో ఉందీ నాప్రాణం, అది నీకు తెలుసునా??
ఉన్నాన్నేను నీకోసం, నువ్వు దూరమైతే బతకగలనా??

ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అస్సలేం తోచదునాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడకా!!

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Chirujallu (2001)
error: Content is protected !!