Antariksham 9000 KMPH (2018)
Antariksham 9000 KMPH (2018)

Antariksham 9000 KMPH (2018)

చిత్రం: అంతరీక్షం (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: హరిణి, యాజిన్ నజీర్
నటీనటులు: వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి, అతిధి హైదరి
దర్శకత్వం: సంకల్ప రెడ్డి
నిర్మాణం: ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేది: 21.12.2018

సమయమా అదేంటి అంత తొండరేంటి ఆగుమా
సమయమా మరింత హాయి పొగుజేయు నీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుకున్న మయాలోన
ఆనంద వర్ణాల సరిగమ

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా

ఆ నింగి జాబిల్లి పై ఏ నీటి జాడున్నదో
నీ చూడలేని అపుడే
ఈ వేళ జాబిల్లి పై సంతోష బాష్పాలని
చూస్తూ ఉన్నా యిప్పుడే
కలే నా సగంగా కలేనా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా

ఏడేడు లోకాలు ఆరారు కాలాలు
ఆ తార తీరాలు ఆనంద ద్వారాలు
తెరిచి మెరిసే వేళ తీపి కురిసే వేళ
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా…
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా