Antham (1992)

చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్. డి. బర్మన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, ఊర్మిళ మతోండ్కర్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: కె.ప్రసాద్
విడుదల తేది: 11.09.1992

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ..లాలలాల…. ఓ..లాలలాల..
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ…
ఓ.. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించని నడి రేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగె చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ

ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
హా… ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యెందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

హాఅ…లాలలాల..హాహ..లాలలాల..

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

*******   *******   ********

చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, కవితాకృష్ణమూర్తి

హే…ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా
హో పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా

ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే

ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగనిగ నీడేగా
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనిగా
ఓ..కోరివస్తా కాదు అనుకోకా…ఆ…

ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే

హో ఎందుకు ఏమిటి అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలములడుగుతూ  చెరిసగమైపోగా
హో..ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ..

పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
హే… ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ..

లలలాల.. లాలలాలా.. లలలాలా
అ.ఆ…లాలలాలలాలా లాలలాలలలాలా

*******   *******   ********

చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

ఓ మైనా నీ గానం నే విన్నా
ఎటు ఉన్నా  ఏటవాలు పాట వెంట రానా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా

లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా
లలలాలాలాలాలాలా…

ఎవరైనా… చూశారా ఎపుడైనా
ఉదయానా… కురిసే వన్నెల వానా హో
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తారా చినుకల్లె జారి వెలిసింది తొలికాంతిగా
నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా

నన్నేనా… కోరుకుంది ఈ వరాల కోనా  హో
ఏలుకోనా  కళ్ళ ముందు విందు ఈ క్షణానా  హో
సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా
వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక
వివరించు ఇంచక్కగా
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక
వనమంతా చూపించగా
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక
వివరించు ఇంచక్కగా
ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే
మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే
కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏదీ రా మరి ఏ మూలున్నా

ఆహహహహ్హహ్హా  ఓహోహోహోహోహ్హోహ్హో
లలలాలా హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
డూడుడుడుడుడూ ఓహోహొహొహొహొహోహో లలలాలాలాలాలాలా…