చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు (All Songs)
గానం: ఎ. యమ్.రాజా, పి.లీలా
నటీనటులు: ఎన్.టి.ఆర్, జమున, సావిత్రి, జగ్గయ్య, గిరిజ
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాతలు: బి.యన్. రెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 14.01.1959
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా ఉం ఉం ఉం ఉం
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా ఉం ఉహు ఉహు
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా
ఉహు చేయి చేయి
చరణం: 1
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా ఉం ఉం ఉం ఉం
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా
అహ చేయి చేయి
చరణం: 2
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా ఉం ఉం ఉహు ఉహు
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా
పల్లవి:
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
చరణం: 1
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
చరణం: 2
వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం
వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
చరణం: 1
అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద
సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా
కొందరు ముచ్చటపడనేలా
చరణం: 2
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా
ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల
కొందరు కలవరపడనేల
చరణం: 3
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా
ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల
కొందరు పరవశ పడనేల
చరణం: 4
కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ….
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ ….
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా, మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ ….
మనసు మీద హాయిగా
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . ..
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా, మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి.
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం:
తన ధర్మంబును పూర్తిగా మరచె కాంతాలోలుడై రాజు,
హెచ్చిన కామాంధత చూడడాయెను ప్రజాక్షేమంబు, పట్టంపురా-
ణినె నిర్లక్ష్యము చేసె, మంత్రులకు నేనిన్ దర్శనంబీయడా-
యెను, దేశానికరాచకంబిటుల ప్రాప్తించెన్ గదా అక్కటా! ఆ…
నీ సుఖము, నీ భోగమె
చూసిన ఎటులమ్మ తల్లీ! చూడుము ప్రజలన్,
దేసము కోసము త్యాగము
చేసిన నీ కీర్తి నిలచు స్థిరముగ ధరణిన్
నీకు వినిపించనేలేదా, దేవా!
నాకు వినిపించిన యీ జాలి పిలుపు
నీకు వినిపించనే లేదా?
పాలించు దొర లేక పాపులు చెలరేగ (2)
అష్టకష్టాలతో అల్లాడ ప్రజలు
ఆకసము తెంచుకుని వెయి కంఠాఆలతో
ఆదుకోరమ్మనే ఆర్తారవాలు
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం:
చిన్నారి చూపులకు ఓ చందమామా,
ఎన్నెన్నొ అర్థాలు ఓ చందమామా, నా చందమామా!
తలుపు చాటున దాగి ఓరచూపులు చూస్తె
పిలిచినట్టే వెళ్ళి పలకరించాలంటు
తలుపు చాటున దాగి ఓరచూపులు చూస్తె
పిలిచినట్టే వెళ్ళి పలకరించాలంటు
తప్పించుకునిపోయి జాలిగా చూస్తేను (2)
వలచినట్టే యెంచి మురిసిపోవాలంట
కనుబొమలు చిట్లించి కోరచూపులు చూస్తె
తననింక విడువనని బాస చేయాలంట
కనుబొమలు చిట్లించి కోరచూపులు చూస్తె
తననింక విడువనని బాస చేయాలంట
కొంగు సవరించుకొని కొరకొరా చూస్తేను (2)
చెంగు వీడనటంచు చెంత చేరాలంట
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: పి.లీలా
రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం!
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2)
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి
శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2)
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి మునులెల్ల గాచినట్టి
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, స్వర్ణలత
ఓ మరదలా, నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా!
నీరూ పాలూ కలిసి ఒకటైనటులే నీవూ నేనూ ఒకటే గదా!
ఓ పంచవన్నెల చిలకా! …ఆ!?
ఆ!
ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2)
మాటాడవేమే? మాటాడవేమే, నీ నోటి ముత్యాలొలక!
ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2)
ఓహో బావా, మార్చుకో నీ వంకరటింకర దోవ!
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే ఒప్పుతుందా యీ లోకం?
ఓ కొంటె బావగారూ!
హాయ్!
ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2)
మా నన్నగారు చూస్తే… మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు!
ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2)
సీమటపాకాయ లాగ చిటాపటాలాడేవు (2)
ప్రేముందా లేదా, ఓ మరదలా, నా మీద?
ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2)
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా? (2)
మరియాద కాదు మీ బావ మరిది చొరవ!
ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు?
మా నన్నగారు చూస్తే… మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు!
ఓ కొంటె బావగారూ! ఓ పంచవన్నెల చిలకా! (2)
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: పి.లీలా, పి.సుశీల
చిగురుల పూవుల సింగారముతో గనలేదు
ముసిముసి నవ్వుల గిలిగింతలతో వసంత ఋతువు రానేలేదు
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో
వలుపులు మీటగ తీయని పాటలు హృదయవీణపై పలికెనుగా,
ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా!
కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే
తళుకుబెళుకుళ తారామణులతో శారదరాత్రులు రాలేదు,
ఆకాశంలో పకపకలాడుచు రాకాచంద్రుడు రానేలేదు!
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల యెందుకనో
తరుణం కాని తరుణంలో నా మది యీ గుబులెందుకనో
తలచిన తలపులు ఫలించగలవని బులబాటము బలమాయెనుగా,
పగటి కల గను కన్యామణులను ప్రియుడే రాకాచంద్రుడుగా!
కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే
తరుణం కాని తరుణంలో నీ మది యీ గుబులందుకనే
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఎ. యమ్.రాజా
మూగవైన యేమిలే, నగుమోమే చాలులే!
సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే!
మూగవైన యేమిలే!
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే..
దొంగ మనసు దాగదులే..సంగతెల్ల తెలిపెనులే!
మూగవైన యేమిలే!
పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే..
పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే..
నను దయతో యేలుకొనుము…
నను దయతో యేలుకొనుము…కనుసన్నల మెలిగెదలే!
మూగవైన యేమిలే!
అందాలే బంధాలై నను బందీ చేసెనులే..
అందాలే బంధాలై నను బందీ చేసెనులే..
కలవరమిక యెందుకులే..
కలవరమిక యెందుకులే..వలదన్నా వదలనులే!
మూగవైన యేమిలే, నగుమోమే చాలులే!
సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే!
మూగవైన యేమిలే!
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఎ. యమ్.రాజా
కాశీకి పోయాను రామా హరీ!
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ! (2)
కాశీకి పోలేదు రామా హరీ,
ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరీ!
మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరీ!
శ్రీశైలమెళ్ళాను రామా హరీ,
శివుని విభూది తెచ్చాను రామా హరీ! (2)
శ్రీశైలం పోలేదు రామా హరీ,
శివుని విభూది తేలేదు రామా హరీ!
ఇది కాష్టంలో బూడిద రామ హరీ!
అన్నమక్కరలేదు రామా హరీ,
నేను గాలి భోంచేస్తాను రామా హరీ! (2)
గాలితో పాటుగా రామ హరీ,
వీరు గారెలే తింటారు రామా హరీ!
నేతి గారెలే తింటారు రామా హరీ!
కైలాసమెళ్ళాను రామా హరీ,
శివుని కళ్ళార చూసాను రామా హరీ!
రెండు కళ్ళార చూసాను రామా హరీ!
కైలాసమెళితేను రామా హరీ,
నంది తన్ని పంపించాడు రామా హరీ,
బాగ తన్ని పంపించాదు రామా హరీ!
ఆలుబిడ్డలు లేరు రామా హరీ,
నేను ఆత్మయోగినండి రామా హరీ!
గొప్ప ఆత్మయోగినండి రామా హరీ!
ఆ మాట నిజమండి రామా హరీ,
నేనందుకే వచ్చాను రామా హరీ!
నేను అందుకే వచ్చాను రామా హరీ!
******** ******** ********
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, స్వర్ణలత
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా