చిత్రం: ఏప్రిల్ 1 న విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, శోభన
దర్శకత్వం: వంశీ
నిర్మాత: పి.వి.భాస్కర రెడ్డి
విడుదల తేది: 01.02 1991
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
షోలే ఉందా ఇదిగో ఇంద
చాల్లే ఇది జ్వాలకాదా తెలుగులొ తీసారే బాలా
ఖైదీ ఉందా ఇదిగో ఇంద
ఖైదీకన్నయ్య కాదే వీడికి అన్నయ్య వాడే
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద
అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
ఒకటా రెండా పదులా వందా
బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా మతిపోయిందా
చాల్లే మీ కాకి గోలా వెళాపాళంటూ లేదా
ఎమైంది భాగం కధ కదిలిందాలేదా కధ
వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట
లౌఖ్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా చేస్తానే ఎమైనా
******** ******** *********
చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
త్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం
లాలిలాలిలాలి … లాలిలాలిలాలి
లాలీ లాలీ … లాలీ లాలీ
కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ హాఆఆఅ