చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.లీల, జిక్కి, బృందం
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: పి. పుల్లయ్య
నిర్మాతలు: శాంతకుమారి, పి. పుల్లయ్య
విడుదల తేది: 26.01.1955
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
భలే మొగుణ్ణి పట్టావు
భలే మొగుణ్ణి పట్టావు
ముసళ్ళ పండగ ముందేలే.. ఏ.. ఏ..
ముసళ్ళ పండగ ముందేలే
అసలు వడ్డీ యివ్వాల్లే
పిల్లా నీ పొగరణిగిందా
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!
మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!
బంగరు నగలు రంగులరాళ్ళు
బంగరు నగలు రంగులరాళ్ళు
బారీ కోకలు పట్టు రైకలు
గంగిరెద్దులా సింగారించి
గాడిద బరువూ మోయాలోయ్ పిల్లా
గాడిద బరువూ మోయాలోయ్
పిల్లా నీ పొగరణిగిందా పొగరణిగిందా
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
అత్తా మామా ఉన్నారూ
అత్తా మామా ఉన్నారూ
నీ సత్తా ఏమో చూస్తారు
పిల్లా నీ పొగరణిగిందా
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
పరదా లోపల మురగాలి
తిరిగే కాలు నిలవాలి
పరదా లోపల మురగాలి
తిరిగే కాలు నిలవాలి
పలుకూ తీరూ మారాలి
పలుకూ తీరూ మారాలి
నీ తల బిరుసంతా తగ్గాలి
పిల్లా నీ పొగరణిగిందా..
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా
పొగరణిగిందా పొగరణిగిందా