చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర
నటీనటులు: మహేష్ బాబు, శ్రేయ, రాజా, కీర్తిరెడ్డి
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: జి. రమేష్ బాబు
విడుదల తేది: 20.08.2004
డుమ్ డుమారే డుమ్ డుమారే
పిల్ల పెళ్ళి చాంగుభళారే భళారే
జంజమారే జంజమారే శివుడు పెళ్ళి చాంగు భళారే భళారే
ఆళ్గర్ పిరుమూడ్లు అందాల చెల్లెలా మిల మిలలాడే మీనాక్షి
నీకంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్ర్రి
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగారికే బొట్టు పెట్టెయ్యరా
తందనాలా తారలతో బంజరు మాకు తప్పించారా
ఈ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా
చరణం: 1
మధురా వురికే రా చిలకా రావేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసినా పన్నీటి ముత్యాలెన్నో
కనుచాపలకు నిదురంటూ రారాదని
కరగెంటానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
భువిలో కోలాటం గుండెలో ఆరాటం
యెదలో మొదలాయే పోరాటమే
చరణం: 2
అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లి ఈ కాపురం
శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
ఇలా పేగుముడి ప్రేమగుడి నా తల్లివే
నువ్వు నా అండగా నాకుండగా కంపించి పోదా కైలాసం
ఇప్పుడే శుభ లగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా
******** ********** *********
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్ని కృష్ణన్, హరిణి
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ
ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం
విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ సాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
******** ********** *********
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. చరణ్, శ్రేయ గోషల్
ఏయ్ పిల్ల ఏం చేద్దాం చెప్పు
ఏదో చేసెయ్ అది మాత్రం తప్పు
ఏయ్ పిల్లా ఏంటమ్మా తప్పు
ఏయ్ అబ్బాయ్ అడగద్దు ఆ అప్పు
ఏఏ కన్నేసా కోనేట్లో ఆడేసా అందాలలో చాలీసా
కోయ్ కోయ్ అబ్బాయి లేలేత సొరకాయి
బోర్లిస్తా బొప్పాస్కాయి
చరణం: 1
ఆ తేనెలలో ప్రేమలీల ఎన్నడో
ఓ ఫ్యామలీగా రాసలీల ఎప్పుడో
నే పక్కకొస్తే నీకు ఎంత తిక్కరో
నే ముద్దు కోరి సోకితే నీ చక్కిరో
అందాలు మాట్లాడు అమ్మాయి ఒళ్ళంతా
అల్లుకుంటే హాయి కంటే తీపి తుళ్ళింతా
ఆరాలు తీసేటి అబ్బాయి కళ్ళంతా
బేరానికొస్తాయి అమ్మయి కళ్ళంతా
చరణం: 2
నే చాకులాంటి సోకులున్న పిల్లని
నా సోకు కిందపైట చాటు ఉండని
ఏ దక్కకున్న తీరదే ఈ దప్పిక
నువ్వు ఒప్పుకుంటే తప్పులేదే గోపిక
రేపొచ్చి కనిపించు రెండో కృష్ణయ్యా
ఈలకైనా తీలకైనా వేళ ఉందయ్యా
కోనేటి కెరటాల కోలాటాలమ్మా
నాటికోక కట్టుకోక బెట్టు ఏలమ్మా
ఏయ్ పిల్లా ఏం చేద్దాం చెప్పు
ఏయ్ చెప్పు కాఫీ ఓకప్పు
ఏయ్ ఒళ్ళు ఎట్టుందో చెప్పు
ఎట్టా ఉన్నా ఉడకదులే నీపప్పు
******** ********** *********
చిత్రం: అర్జున్ (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్
సంభవామి సంభవామి
సాగరాలే దాటిపోనీ,
అంబరాలే అంటుకోనీ..
సంభవామి.
పల్లవి :
ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేలే గురి గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే చరి చరి
ఓటుమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనస్సు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో
ఛల్‌రె చల్‌రే ఛలో . . .ఛల్‌రె చల్‌రే ఛలో . . .
free ur mind free ur soul
see what u find and take control
high high through the sky through the sky fly high
through the sky fly
through the sky fly high fly
one word one shoot
i am here to stay
చరణం: 1
చుక్కలు తెంచెయ్ చకా చకా
హక్కులు మనవే పక పక
రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్ని ఏలుకో
స్వాగతం అనధిరంగా గీతికా
జోకులకే కధ చేబుదాం వెన్నెలతో మొరపెడదాం
సాహసం చెయ్యర ఇంకా ఢింభకా
చెంగులతో ఓడిద్దాం చెడుగుడునే ఆడేద్దాం
ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వంనీకే సంభవం
ఓ దశ నీ ప్రేయసేలే ఛల్‌రేఛలో ఛల్‌రే ఛలో
చరణం: 2
పరుగులు పెట్టే గంగ నువ్వు ఉరికే కృష్ణకు కలపరా
నదులే కాదు యెదలను కలిపిస్తేనే గెలుపురా
జీవితం ఈ పేటర్లలో స్నేహితం
స్వరములతో జతకడదాం క్షణములలో గురి పెడదాం
ఎవ్వరం ఇజీకోల్టు అద్భుతం
మనస్సల్లే పరిగెడదాం మనిషల్లే నిలబడదాం
వేగం వేగం అంతా వేగం సంభవం సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేయసేలే ఛల్‌రె ఛలో ఛల్‌రేఛలో