Arjun Reddy (2017)

arjun reddy 2017

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్ (పాటలు)
బాక్గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని పాండే, కాంచన (Old Actress)
కథ, స్క్రీన్ ప్లే , మాటలు,  దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ
సినిమాటోగ్రఫీ: తోట రాజు
ఎడిటర్: శశాంక్ మాలి
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ ( S/o సందీప్ రెడ్డి వంగ )
విడుదల తేది: 25.08.2017

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: సమీరా భరద్వాజ్

మదురమె ఈ క్షనమే ఓ చెలి
మదురమె ఈ క్షనమే

మదురమె వీక్షనమే ఓ చెలి
మదురమె వీక్షనమే

మదురమే లాలసనే
మదురమే లాలనయే

మదురమె లాహిరిలే
మదురం లాలితమే…

మదు పవనం వీచి
మదు పవనం వీచి
పరువమె మైమరచె

కాలం పరుగులు ఆపి
వీక్షించె అందాలే

మోహం తన్మైయమొంది స్వాసించె గధాలె
ఓరించె రుచులను మరిగి ఒడికించు తాపాలే…

ఉప్పొంగి ఊపిరి సెగలొ కవ్వించె దాహాలె
మౌనంగా మధువుల జడిలోన పులకించె ప్రానాలె

మదురమె ఈ క్షనమే ఓ చెలి
మదురమె ఈ క్షనమే

వీచె గాలులు దాగి
చెప్పెనె గుస గుసలే
చూసె ముసి ముసి నవ్వులు
చేసే బాసలనె
వసమై ఆనందపు లోగిట
అరుదించి ఆకసం…
సగమై ఈ సగరమందె
అగుపించె ఆసాంతం
తీరం ముడివేసిన దారం
తీర్చె ఎద బారాలె…

*******  ********  *********

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నిఖితా గాంధి

దూరం దగ్గర చేస్తున్నది
ఇంకా ఇస్టం పెంచిందదీ
మల్లి మల్లి కలిసే తొందరా
కాలాన్నైనా తరిమేస్తుందది

ఆ దిక్కు ఈ దిక్కు
మౌనంగా ఒక్కటైయ్యయే…

నా ఊరు నీ ఊరు
మనల్ని వేరు చెయ్లేవే…

రా రా రా… కౌగిలై….
రా రా రా…  ఊపిరై….

రా రా రా… కౌగిలై….
రా రా రా… ఊపిరై….

ప్రానం రెక్కలు చాస్తున్నదీ
నీకై రివ్వున వస్తున్నది
నీపై వాలి నిదురించాలని
ఆకాషాన్నె ఓడిస్తున్నది

నాదాక నువ్ వొస్తె
నీదాక నేను వొస్తుంటె
ఈ దేషం ఈ లోకం
ఇంకింకా చిన్నవైనాయే…

రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….
రా రా రా రారరా….

********  ********  ********

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: ఎల్. వి.రేవంత్

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనె నీ నేను కానని
నాలొ సగం ఇక లేదూ అని
నా నిన్నలే నన్ను చూసి నవ్వెలే…

మరు నాడు అన్నదె ఇక ఉండబోదని
అన్నదీక్షనం…..

నా ప్రానం నువ్వే
నా గుండె నువ్వె గుండెల్లొ మండే
నిప్పై చేరావే…

ఊహలకె తెలియనిదె
జరిగెనులె ఇపుడెలా…
నువ్వు నేను అను మాటె
ఇకపై ఉండదులె ఏంతిలా

తప్పు ఏదొ జరిగెను
రెప్ప పాటులో…
చెప్పలేని వేదనగా
ఉప్పెనగ తరుముతోందె
నువ్వు లేనిదే
మరి నేను లేనని…
అన్న ఈ క్షనం….

నా అంతం నువ్వే….
నా పంతం నువ్వే…
నా పంతం ఎంతా…
ఈ విష్వం అంతా….

నా అంతం నువ్వే….
నా పంతం నువ్వే…
నా పంతం ఎంతా…
ఈ విష్వం అంతా….

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనె నీ నేను కానని

********  ********  ********

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రేష్ఠా
గానం: సౌజన్య

గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
కళ్ళలోన నింపుకున్న
నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్లూ
చెప్పనీ చెప్పనీ మనసు తాలలేదని నీ దూరమే
తప్పనే తప్పని తాపమే తీరనీ ఈనాడే
గుండెలోన నిండుకున్న

నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ
నీ అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని
నా అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ
ఏ దారి మలపు లోను ఇంక వీడనే వీడనీ
నీ లోని నీడ నేనులాగ నన్ను మారనీ
తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలే
ప్రాణం చెయ్ జారి మళ్ళి చేరగ తన తీరాన్నే
కమ్మనైన ఓ హాయివాన కురావగా ఇలా చిరునవ్వులోన

గుండెలోన నిండుకున్న
ఊసులన్ని చెప్పుకోగా ఈనాడు
కళ్ళలోన దాచుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు

పరవశం పరవశం అవ్వనీ మన వశం
చిలకరించు నవ్వులు మునికి ఈ జగం
చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం
పలకరించు ఆశలే హృదయనందనం
అలలే జోలలను పాడి అలుపే మరిచేనే
కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే
అల్లుతున్న హరివిల్లులోన
అందుకోగా స్వర్గసీమ

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ
గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగా ఈనాడు

********  ********  ********

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: మండేల పెదస్వామి
గానం: గౌతమి

మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమై ఈ కధ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా

మరీ మరీ కొత్తగ నీ జత
మరో మరో చిత్రమై ఈ కధ

నీ అడుగులలోన నా నడకలివేనా
తెలియక నా గుండెకి
తికమకలేనా తరగక ఆరాధన
ప్రతీసారి అదే తీరున

ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక
పరుగేలా నీ దారికి పరిహాసంగా
నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా
ఇలా ఇలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్నా ఆగక

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top