చిత్రం: అరుంధతి (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: కైలాష్ ఖేర్
నటీనటులు: అనుష్క శెట్టి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 2009
కమ్ముకున్నా చీకట్లోనా
కుమ్ముకొచ్చే వెలుతురమ్మా
కచ్చకట్టీ కత్తిపడితే
చిచ్చురేపే కాళివమ్మా
నీ కన్ను ఉరిమి చూడగానే
దూసిన కత్తి వణికిపోవునమ్మా
కుంచె పట్టి బొమ్మగీస్తే
అదే నీ గుండెకే అద్దమమ్మా
అందరినీ ఆదరించే దయామయి
అన్నపూర్ణ నీవమ్మా
ఆలన పాలనలో నువ్వే
ఈ నేలకు తల్లివమ్మా
నువ్వు పలికేదే తిరుగులేని వేదం
నువ్వు చేసేదే ఎదురులేని చట్టం
ఓర్పులోన ధరణి మాతవమ్మా
తీర్పులోన ధర్మమూర్తివమ్మా
జేజెమ్మా మాయమ్మా జేజెమ్మా ఓయమ్మా
జేజెమ్మా జేజెమ్మా మా జేజెమ్మా (2)
నువ్వు రుద్రరూపమెత్తగానే
కాలమే దద్దరిల్లి పోయేనమ్మా
రుద్రశక్తులకు నీ ధాటితో
గుండెలే బద్దలైపోయేనమ్మా
బుసగొట్టే కామాంధుని
కసితీరక తొక్కవమ్మా
పుట్టుగడ్డ ఆదుకున్న
ఆ అపర భద్రకాళి నీవమ్మా
మాటనిలుపుకొంటివమ్మా జేజెమ్మా
మళ్ళి జన్మ ఎత్తినావమ్మా
ఎంత దీక్ష పూనినావమ్మా
గుండెలో నిప్పులే నింపినావమ్మా
త్యాగమంటే నీదమ్మా
నరకమే కొంగులోన ముడిచావమ్మా
నిన్నుచూసి మృత్యువుకే జేజెమ్మా
కళ్లు చెమ్మగిల్లినాయమ్మా
ఈ జారుతున్న రక్తధారలే
నీ తెగువకు హారతులు పట్టేనవ్మూ…
ఓ… ఓ…
ఆ… ఆ…
దిక్కులన్నీ శూన్యమాయే
వెలుతురంతా చీకటాయే
ఆశలన్నీ ఇంకిపోయే
శ్వాస మాత్రం మిగిలిపోయే
******** ********* *********
చిత్రం: అరుంధతి (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: మురళి, సందీప్, శ్రీ కృష్ణ
పల్లవి:
చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంత నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లే మెళ్ళో వేశావే
డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే ఢం ఇల్లంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం
డోలారే డోలారే ఢం కోలాటాలాడే క్షణం
డోలారే డోలారే ఢం ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం
చరణం: 1
ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి
ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మామిడి
ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించి వాడె వస్తున్నాడు అడ్డం లెగండోయ్
హే… డోలారే డోలారే ఢం అరె వారేవా ఏం సోయగం
డోలారే డోలారే ఢం నువ్వేగా నాలో సగం
డోలారే డోలారే ఢం…
కార్తీకదీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా
శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద
జేజమ్మా జేజమ్మా జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా
చరణం: 2
నాతోటే నాచోరే ఓ సోనియే
నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా
ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట
కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండోయ్
డోలారే డోలారే ఢం నా చుట్టూ ఈ సంబంధం
డోలారే డోలారే ఢం ఏ జన్మదో ఈ వరం
ప్రాణంలో నే దాచుకుంటాను పంచేటి ఆ ప్రాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము
డోలారే డోలారే ఢం
ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం