చిత్రం: అసాధ్యుడు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఆర్ యకేందర్
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, దియా
దర్శకత్వం: అనీల్ కృష్ణ
నిర్మాత: వల్లూరుపల్లి రమేష్ బాబు
విడుదల తేది: 16.02.2006
రక్కసి కోరలు చాచిన రౌడిమంది ఒకవైపు
శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు
ఆ చూపుల చింతనిప్పు దుర్మార్గులకుంది ముప్పు
ఆ అడుగుల పిడుగుపాటు దుండగీళ్ళ ఆట కట్టు
అదరడు బెదరడు చెదరడు
బిగిసిన పిడికిలినొదలడు
అతనొక అనుపమశూరుడు అసాధ్యుడు
అలసట ఎరుగని యోధుడు
అపజయమెరుగని విజయుడు
అసురుల కూల్చకమానడు అసాధ్యుడు
రక్షణ చేయు నృసింహుడు
రాక్షస కేళి సహించడు
దుర్జనశేషములుంచడు అసాధ్యుడు
సహనము తెలిసిన బుద్దుడు
సమరము నిలిచిన భద్రుడు
సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు
సమయము స్థలమిక చూడడు
కదనము అతనికి చెడుగుడు
శత్రుశిరస్సులనొదలడు అసాధ్యుడు
కనపడి దుడుకుగ సాగడు
తలపడి వెనకడుగెరగడు
తలచిన గురినిక వదలడు అసాధ్యుడు
కరుణతొ కరిగిన వరుణుడు
కొలిమిగ రగిలిన అరుణుడు
వీడు దహించక మానడు అసాధ్యుడు
అతడే అనితరసాధ్యుడు
అతడే అభినవ పార్ధుడు
అతడే అతడే అతడే అసాధ్యుడు