చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య
నటీనటులు: జూ.యన్. టి.ఆర్, సమీరా రెడ్డి
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
విడుదల తేది: 14.07.2006
ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా
నీకై నేను అలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా…
ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…
రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా కమ్మని సంగతులెన్నో నా ఎద గుండెల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయస్సంతా వలపై ఉన్నా…
ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…
స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
శతజన్మాల ప్రేమౌతున్నా…
ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…