చిత్రం: అశోక చక్రవర్తి (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: బాలక్రిష్ణ , భానుప్రియ
దర్శకత్వం: యస్.యస్.రవిచంద్ర
నిర్మాత: శ్రీమతి కాజా వెంకట రవమ్మా
విడుదల తేది: 29.06.1989
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎదలా ఎదుటే మెరిసీ.. వలపై.. ఇలపై.. నిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
నీ రాధనేరా.. ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే.. వేసి ఈల
నీకెందుకా దేవి పూజ.. నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల.. ఈ దేవతే కాలుజారి
అందుకో.. మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా.. చాలికా…
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
నీ కొంగు జారి.. శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే.. నా లేత ప్రాణాలు తీసే
నిన్నంటుకున్నాక రేయి.. కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే.. మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా.. కిమ్మనకా.. పొమ్మనక
ఆపరా.. నా దొర.. తొందరా
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము