చిత్రం: అష్టా చమ్మా (2008)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీ కృష్ణ
నటీనటులు: నాని , కలర్స్ స్వాతి, అవసరాల శ్రీనివాస్ , భార్గవి
దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నిర్మాత: పి.రామ్మోహన్
విడుదల తేది: 05.09.2008
పల్లవి :
ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
చరణం: 1
ఓ… ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఉఁ… ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకొనూ
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో నిలేసే గళ్ళ బాటలో
నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
చరణం: 2
ఓ… నా నేరం ఏఁవుందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
ఉఁ… మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా
పూవ్వంటీ రూపం నాజుగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటీ కోపం ఒళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవిలేవీ అంత కొత్తేం కాదమ్మా
********* ********* **********
చిత్రం: అష్టా చమ్మా (2008)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీకృష్ణ , సుష్మా
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి – ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదో ఇచ్చి – వచ్చెయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవా ప్రతాపా
హ బెదరకే పాపా – వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి – కీడెంచి మేలెంచి
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
చరణం: 1
ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరినేమారుస్తాం – ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం – మన్మథ మంత్రం వేద్దాం
రేయిలాంటి మైకం కప్పుకొని ఉందాం
మాయదారి లోకం కంట పడదందాం
మన ఏకాంతం – మనకే సొంతం
అష్ట దిక్కులన్ని దుష్ట శక్తులల్లే కట్టకట్టుకొచ్చి
చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం – ముద్దుల్లో ముంచేద్దాం
ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
చరణం: 2
పిల్లకి మెళ్ళో పుస్తే కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళొ గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవె చిట్టీ – చంపకు ఊదరగొట్టి
దగ్గిర దగ్గిర ఉండి – తగ్గదు బాదర బంది
ఆవురావురందీ ఆకలాగనంది
ఆవిరెక్కువుంది అంటుకోకు అందీ
హ తట్టుకోడమెల్లా – ముట్టుకుంటే డిల్లా
విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూసి కూడా
పస్తులుండమని ఎవ్వరిది శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం – అయినా పెడతా శాపం
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి – ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదో ఇచ్చి – వచ్చెయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవా ప్రతాపా
హ బెదరకే పాపా – వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి – కీడెంచి మేలెంచి
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
********* ********* **********
చిత్రం: అష్టా చమ్మా (2008)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరామచంద్ర, మానస వీణ
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
చూస్తూనే ఉన్నా…
అవునా అంటున్నా…
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
స నీ ద స నీ ద స నీ ద స నీ ద పా
చరణం: 1
పరవాలేదు పరువేమి పోదే పరాదాలోనే పడి ఉండరాడే
పరుడేం కాదే వరసైనవాడే బిడియం దేనికే హృదయమా
చొరవే చేస్తే పొరపాటు కాదే వెనకడుగేస్తే మగజన్మ కాదే
తరుణం మించి పోనీయరాదే మనసా ఇంతా మొమాటమా
మామూలుగా ఉండవే
ఏ సంగతీ అడగవే
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ఆ నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
నవ్వాలో లేదో అనుకుంటూ లోలో సంతోషం దాగుంది తెరలో
చరణం: 2
పసిపాపాయి కేరింత కొంత గడుసమ్మాయి కవ్వింత కొంత
కలిసొచ్చింది కలగన్న వింత కనుకే ఇంత ఆశ్చర్యమా
ఊర్లో ఉన్న ప్రతి కన్నే కంట ఊరించాలి కన్నీటి మంట
వరమే వచ్చి నా కొంగు వెంట తిరిగిందన్న ఆనందమా
కొక్కోరకో మేలుకో
కైపెందుకో కోలుకో
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే
నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో
చూస్తూనే ఉన్నా…
అవునా అంటున్నా…
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
అయ్యబాబోయ్ నువ్వా ను ను ను నువ్వా
ను ను ను నువ్వా నువ్వా నువ్వా
ను నున్ను నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వెలే
********* ********* **********
చిత్రం: అష్టా చమ్మా (2008)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరామచంద్ర
పల్లవి:
తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా
స్థిరంలేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా
హడావుడిగ పడిలేచే కడలి అలని
బలాదూరు తిరిగొచ్చే గాలితెరని
అదేపనిగ పరిగెత్తేవెందుకని
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
చరణం: 1
కృష్ణా ముకుందా మురారే
నిష్టూరమైనా నిజం చెప్పమన్నారె
ఇష్టానుసారంగ పోనీరే
సాష్టాంగ పడి భక్తి సంకెళ్ళు కడతారె
నీ ఆలయానా గాలి ఐనా ఈల వేసేనా
ఏ కేళికైనా లీలకైనా వేళ కుదిరేనా
దేవుళ్ళాగ ఉంటే ఫ్రీడం అంత సులువా
ఆవారాగ నువు ఆనందించగలవా
ఉస్కో అంటు ఇక ఉడాయించుమరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
చరణం: 2
శ్రీరాముడంటుంటె అంతా
శివతాండవం చేస్తే చెడిపోదా మరియాద
మతిమరుపు మితిమీరి పోకుండా
అతిపొదుపు చూపాలి నవ్వైన నడకైన
ఈ ఫ్రేముదాటి పైకి వస్తే లోకువైపోవా
నీ పరువునీదా పదవినీదా ప్రజలదనుకోవా
చిరాగ్గుంటె ఈ మరీ పెద్దతరహా
సరె ఐతే విను ఇదో చిన్న సలహా
పరారైతె సరి మరో వైపు మరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది