చిత్రం: అశ్వమేధం (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: బాలక్రిష్ణ , శోభన్ బాబు, నగ్మా, మీనా
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 25.12.1992
చిత్రం: అశ్వమేధం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
ఆహా ఓహో యహ యహ యహ యహ
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో
దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో
దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
చరణం: 1
కొప్పులోన సంపెంగంటా
ఆ పువ్వు మీద నా బెంగంటా
తోలి రేకు సోకూ నీకే ఇస్తా
నవ్వు జాజి పులేనంటా
నేను తుమ్మేదల్లె వాలేనంటా
మరుమల్లె జాజి మందారాల పానుపెస్తానంటా
మురిపాలు పోస్తానే
వేసుకుంటా గడియ విడిపోకు నన్నీ ఘడియా
దాస్తే చూస్తావు చూస్తే దోస్తావు
అల్లారు అందాలు హొయ్ కుడి ఎడమ
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో
దాచుకో అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో
దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
చరణం: 2
కంచిపట్టు చీరేకట్టి నిను కంచెలగా నెనే చుట్టి
అరె చెంగే కాస్త చేనే మేస్తా
వెన్నపూస మనసే ఇచ్చి చిరునల్లపూస నడుమే ఇస్తే
అరె కవ్వం లాగా తిప్పి తిప్పి కౌగిలిస్తానంటా
నను కాదు పొమ్మన్నా
తొలిసారి విన్నా మాటా ప్రతి రేయి నా పాటా
నీతో పేచీలు రాత్రే రాజీలు
నా ప్రేమ పాటాలు హొయ్ గుడిఎనక
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో
దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో
దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు యమ యవ్వారం
చిత్రం: అశ్వమేధం (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, ఆశాభోంస్లే
పల్లవి:
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె
పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనా
రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే
రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా…
చరణం: 1
చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా
వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా
వసంతపు తేనెతోనే తలంటులే పోయనా
వరూధినీ సోయగాల స్వరాలు నే మీటనా
నువ్వుకల్లోకొస్తే తెల్లారే కాలం
నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీరాగం
రెండు గుండెల్లోన తప్పిందీతాళం
మురిసింది తార మూగాకాశంలో
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే
రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక నేనేమైనా నీకేమైన గాలేవీచి
కూలే ప్రేమా తెలుసా
విధి నిన్ను ఓడిస్తుంటే వ్యధలాగే నేనున్నా
కథ మారి కాటేస్తుంటే ఒడిగట్టి పోతున్నా
ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళ
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె
పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా…
చరణం: 2
మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవి
ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవి
ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా
ఎదారిన దారిలోనే షికారులే నావిగా
కన్నె అందాలన్నీ పంపే ఆహ్వానం
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం
స్వర్గ లోకంలోనే పెళ్లి పేరంటం
సందెమైకంలోనే పండే తాంబూలం
మెరిసింది తార ప్రేమకాశంలో
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె
పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనా
రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే
రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా…