By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Sign In
A To Z Telugu LyricsA To Z Telugu Lyrics
Notification
Latest Lyric
Zari Zari Panche Katti Song Lyrics – Telugu Folk Songs Maanas, Vishnu Priya
Movie Albums
Oo Shivangi Song Lyrics – Thiru Telugu Movie #MassSong
Movie Albums
Coka 2.0 Song Lyrics – Liger Telugu Movie
Movie Albums
Jinthaak Song Lyrics – Dhamaka, Mangli
Movie Albums
Tharali Tharali Song Lyrics/తరలి తరలి మరి రారా లిరిక్స్
Tharali Tharali Song Lyrics – Sita Ramam
Movie Albums
Aa
  • Movie Albums
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Reading: Athadu (2005)
Share
A To Z Telugu LyricsA To Z Telugu Lyrics
Aa
  • Movie Albums
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Search
  • Movie Albums
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Have an existing account? Sign In
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
Copyright © A To Z Telugu Lyrics 2019-2023. All Rights Reserved.
Mahesh BabuMovie Albums

Athadu (2005)

Last updated: 2022/05/17 at 3:23 PM
Share
9 Min Read
SHARE

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చైత్ర ,  యస్ పి బాలు
నటీనటులు: మహేష్ బాబు, త్రిష
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: డి.కిషోర్ , యమ్.రామ్మోహన్
విడుదల తేది: 10.08.2005

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా…
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాల పైపైన పడతావెం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన
మగువ మనసు తెలిసేన మగజాతికి
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికీ కూత దేనికి

గారం చేసిన నయగారం చూపినా
కనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచనా

ఒదిగున్నా ఒరలోన కదిలించకే కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారెనా
పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమారుడంటీ నీ రాజసానికి

గారం చేసిన నయగారం చూపినా
కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా…
ఓ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

**********   **********   **********

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: శ్రేయ ఘోషాల్

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేనా

ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ

అందమైన సిరివానా ముచ్చటగ మెరిసే సమయానా
అందరాని చంద్రుడైన మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా
మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా
ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
హో మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా

ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా

చంద్ర జాలమై తరంగాల ఒడిలో యెల్లన్ని మురిపించగా
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం
హో నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం
ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పోగా హోరెత్తి పోతున్న గానా బజానా
చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైన మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

**********   **********   **********

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
అతడే అతడే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే

Life has made it stronger
it made him work a bit harder
he got to think and act a little wiser
this world has made him a fighter

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదాపడితే సమరంలో గెలిచేస్తా
నే పెళపెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగధగ మెరుపై వెలుగుతూ
పెనునిప్పై నివురును చీల్చుతూ
జడి వానై నే తలబడతా

పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే

చుట్టూ చీకటి వున్నా వెలిగే కిరణం అతడే
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడే

పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
తన ఎదలో పగ మేల్కొలుపుతూ
ఒడి దుడుకుల వల చేదించుతూ
ప్రతినిత్యం కథనం జరుపుతూ
చెలరేగే ఓ శరమతడు

Life started to be faster
made him had a little think smoother
he’s living on the edge to be smarter
this world has made him a fighter

**********   **********   **********

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: కార్తిక్, కవితా సుబ్రహ్మణ్యం

పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా
నలుగురూ వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా..
తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావ
అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ
తటపటా ఇస్తూ వుంటావా..
సమయం కాదంటావ సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా..
చనువే తగదంటావా మనవే విననంటావా
వరసై ఇటు రమ్మంటే నామాట మన్నించవా

డోలు భాజాల ఇలా నా వెంట పడతావ
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావ

డోలు భాజాల ఇలా నా వెంట పడతావ
చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావ

కనులుంటే సొగసే కనపడదా
మనసుంటే తగుమార్గం దొరకదా.. రాననక
అనుకుంటే సరిపోదే వనిత
అటుపై ఏ పోరాబాటో జరగదా.. రమ్మనక
పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే
తరిమిన తాపం తాలదే మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి
హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే
హావ హవాయి అమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి

హావ హవాయి అమ్మో అమ్మాయి
విన్నాం కదా నీ సన్నాయి
పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా
నలుగురూ వున్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా..

మొహమాటం పడతావ అతిగా
సుకుమారం చిటికేస్తే చొరవగా .. చేరవుగా
ఇరకాటం పెడతావే ఇదిగా ఆబలా
నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా.. ఆగవుగా
దరిశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా
వరాల బాలా వారిన్చువేల తరిన్చానంటు తగువెల
నిగారమిట్ట జిగేలనల జనం చెడేల జవరాల

నిగారమిట్ట జిగేలనల జనం చెడేల జవరాల
తనాన నానే తనాన నానే తనాన నానే తననాన

తనాన నానే తనాన నానే తనాన నానే తననాన

*********  *********  **********

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: శ్రేయ గోషల్

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర చెసి మెరుపై తరిమెనా
ఎల్లలన్నీ కరిగి.. జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో
వేవేల వర్ణాల వయ్యారి జాన
అందమైన సిరివాన
ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేన
ఝల్లు మంటూ గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేన
ఝల్లు మంటూ గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
ఇంద్ర జాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగా
తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం
నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృంద గానం
ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం
పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నో పలికేసరికొత్త రాగాలుగా
నింగి దాక పొంగి పొగ హోరెత్తి పోతున్న గానా బజానా
చెంగు మంటూ ఆడేనా చిత్రంగా జావలీలు పాడేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

*********  *********  **********

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: కె.కె., సునీత

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా.. అఆఅఆ
తెలిసిందే.. అడగాలా..
అడగందే.. అనవేలా..
చెవిలో ఇలా చెబితే చాల
అవును  నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం

కసిరేస్తున్న మనసుకు వినపడదో ఏమో
విసిరేస్తున్న నినువిడి వెనకకి రాదేమో
నిదరోతున్న ఎదురై కనపడతావేమో
కదలాలన్న కుదరని మేలి పెడతావేమో
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందు కొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకద
తెలుసుకదా.. ఆ ఆ ఆ ఆ
తెలిసే ఇలా చెలరేగాలా
అవును  నిజం నువ్వంటే నాకిష్టం

ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం

సుడి గాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
యద ఏమందో వినమని తరుముకు రాలేనా
తప్పుకో కళ్ళుమూసుకుని
తుళ్ళి రాకే నా వెంట
వొప్పుకో నిన్ను నమ్మమని
అల్లుకుంట నీ జంట
నడపదుగా నిను నది వరద
తెలుసు కదా .. ఆ ఆ ఆ ఆ
తెలిసే ఇలా ముంచెయ్యాల

అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఏ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసుకదా.. అఆఅఆ
తెలిసిందే.. అడగాలా..
అడగందే.. అనవేలా..
చెవిలో ఇలా చెబితే చాల

*********  *********  ********

చిత్రం: అతడు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: రంజిత్, మహాలక్ష్మి అయ్యర్

చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా జంటై రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
నో నో – ఒకసారిటు చూడు
నో నో  –  నీ సొమ్మేం పోదు
నో నో  – ముద్దంటే చేదా.. ఆ ఆ
నో నో  – నాతొ మాటాడు
నో నో  – పోనీ పోటాడు
నో నో  – సరదా పడరాదా
దా  దా  దా  దా

చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా

వస్తు పోతూ వేధిస్తుంటే కల్లో
కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో
కల్లో ఐతే సర్లే గాని తల్లో
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
దేఖోనా… సిగ్గును కొద్దిగా సైడికి నెట్టా
ఓకేనా ఎం బాగా లేనా
దాగేనా కొంగుకు లొంగని సంగతులెన్నో
చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా…  –  నో నో
ఇంత చెప్పినా డౌటేనా… –  న న న నా
ఇల్లారా కళ్ళారా చూస్తావా ఇంకా
ఎన్నో.. ఎన్నో.. ఎన్నో

చందమామా  చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా

కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా
నీలో చాలా విద్యే ఉందే జానా
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా… తున్నా
చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో
విన్నాలే శృంగార వీణ
తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే
కానిలే నే కాదన్నానా
ఉపిరాడదే నీ ఒళ్ళో  –  నో నో
ఉండిపోకలా దూరంలో  –  నో నో
ముస్తాబై వచ్చేవా
ముద్దిచ్చే ఉద్దేశం తో.. ఆహా…

చందమామా  చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా జంటై రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా

You Might Also Like

Zari Zari Panche Katti Song Lyrics – Telugu Folk Songs Maanas, Vishnu Priya

Oo Shivangi Song Lyrics – Thiru Telugu Movie #MassSong

Coka 2.0 Song Lyrics – Liger Telugu Movie

Jinthaak Song Lyrics – Dhamaka, Mangli

Tharali Tharali Song Lyrics – Sita Ramam

TAGGED: 2005, Athadu, Mahesh Babu, Mani Sharma, Trisha, Trivikram Srinivas

Sign Up For Daily Lyricsletter

Be keep up! Get the latest lyrics delivered straight to your inbox.

    By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
    Share this Lyric
    Facebook Twitter Email
    Share
    Previous Lyric Businessman (2012)
    Next Lyric Sainikudu (2006)
    17 Comments 17 Comments

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    Facebook Fan Page👍

    A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

    Copyright © A To Z Telugu Lyrics 2019-2023. All Rights Reserved.

    • About Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms and Conditions
    • Contact Us
    A To Z Telugu Lyrics
    Join Us!

    Subscribe to our lyricsletter and never miss our latest lyrics, updates etc..

      Zero spam, Unsubscribe at any time.

      Removed from reading list

      Undo
      login A To Z Telugu Lyrics
      Welcome Back!

      Sign in to your account

      Lost your password?