చిత్రం: అతనికంటే ఘనుడు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి
నటీనటులు: కృష్ణ , జయప్రద
కథ:
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: జి. సి. శేఖర్
నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీకుమార్
ఫోటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్: మారుతీ ప్రొడక్షన్స్
విడుదల తేది: 01.12.1978
పల్లవి:
తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా
తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా
అరకోడి కూరుందిరా అది చల్లారిపోతుందిరా వేడి
చల్లారిపోతుందిరా
చరణం: 1
సలవ చీర కట్టుకుంటిని
రాత్రికది నలిగిపోతదనుకుంటిని
మురిసి మురిసి చూసుకుంటిని
పడుచుదనం కరుకునంత దాచుకుంటిని
అద్దంలో నన్ను చుస్తిని ముద్దొచ్చి కన్ను కొడితిని
ఎనకళ్ళే నువ్వొచ్చి పెనవేసు కుంటావు
అనుకుంటూ కాచుంటిని
కానీ మావా, నా ఆశ చూపుల్లో అలిసిందిరా
నా సోకు నాపైన అలిగిందిరా కన్నెర్ర జేసిందిరా
తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా
చరణం: 2
సందెవేళ చల్లగుందని నీకోసం వేడ్నీళ్ళు కాచి పెడితిని
చందమామ నవ్వు చుస్తిని
ఘొల్లుమంటి చన్నీళ్ళు తోరిపోస్తిని
చన్నీళ్ళు వేడెక్కనీ వేడ్నీళ్ళు చల్లారనీ
కౌగిట్లో రెంటినీ కలబోసు కుందాము
అని ఎదురు చూస్తుంటినీ
కానీ మావా, నా సోకు చీకట్లో కలిసిందిరా
ఈ మాపు మంచల్లే కరిగిందిరా ఒక జామే మిగిలిందిరా
తొలికోడి కూసిందిరా మావా తెల్లరిపోతుందిరా