చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్
నటీనటులు: అల్లరి నరేష్ , కౌష , విదీష ,
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 06.04.2007
పల్లవి:
ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
ఎదుట నిలిచా ఎదను కలిపా రాని నిదురలు పోలేక
వచ్చాక కుదరదు ఇక అలుకా
గిచ్చాక బెదరడు చెలి కనుక
ఇచ్చాక అడగకు ఇమ్మని ఇంకో కానుక
హో ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
హో నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
చరణం: 1
ఎల్లలు లేవిక ఓ చిలుకా ఎగిరాక నింగి దాకా
తికమక లేదిక ఓ మునక మునిగాక గొంతుదాక
దాహము తీరక మోహమిక తొలికేక వేసినాక
ఝల ఝల పారక సాగదిక చెలి రాక ఏరువాక
చక చక వలచినామిక బెరుకు చాలిక అడుముకోయిక
అరరె తోచక మనసు దాచక
పరుచుకోయిక వయసు నాయిక
కోరస్: పిలుపు తలపొక తెలుపక
ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
చరణం: 2
నిన్నెడబాయక నీ వెనుక నిలిచాక ఇంత సోకా
ఎకసెక లాడక ఏమనక నిను తాక వచ్చినాక
కోరిక రేపక చేరు ఇక కదిలాక ప్రేమ నౌక
గుస గుస లాడక తప్పదిక ముదిరాక ఈడు పాక
పక పక నఘవు లాపక ఎదురు చూడగ ఎదురు రాయిక
అరరె రోజొక ఇలకు నీదిక
అలుపు లేదిక ఎడము చాలక
కోరస్: గడియ వదలక కదలక
హో నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
ఎదుట నిలిచా ఎదను కలిపా రాని నిదురలు పోలేక
వచ్చాక కుదరదు ఇక అలుకా
గిచ్చాక బెదరడు చెలి కనుక
ఇచ్చాక అడగకు ఇమ్మని ఇంకో కానుక