Attaku Yamudu Ammayiki Mogudu (1989)

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి
దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 14.01.1989

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి:
దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

చరణం: 1 
వాటేసి చూశాకే ఓ భామా
తెలిసింది వయసెంతో ఓలమ్మో
ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా  తేలింది వలపెంతో ఓరయ్యో
కాటేసుకున్నాకే ఓలమ్మి కందింది నీ బుగ్గే ఎర్రంగా
సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

చరణం: 2
నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి పడుకుంటే తోడుంటా
నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట
కవ్వించుకున్నాకే ఓరయ్యో కాళింది పొంగింది ఒళ్ళంతా
నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  చక్రవర్తి
సాహిత్యం:  భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

పల్లవి:
మెరుపులా.. లా.. లా…  ఆడతా.. తా.. తా
పిడుగులా .. లా.. లా… రేగుతా.. తా.. తా
దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

చరణం: 1 
డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం
అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం
ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం
ఫటా ఫట్ నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం
ప్యారే తెలుసుకో దారి మలుచుకో
హద్దు మీరకు ఆటలాడకు జా జా

మెరుపులా.. లా.. లా…  ఆడతా.. తా.. తా
పిడుగులా .. లా.. లా… రేగుతా.. తా.. తా
దమ్ముంటే కాస్కో  చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

చరణం: 2
సలాము చేస్తే గులాము నేనై ఉంటా
ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంటా
రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా
ఓరబ్బా హోలు సేలుగా గోలుమాలు చేయిస్తా
దేఖో మెహబూబా…  పోటీ తగదిక
కాలు కదిపితే కాటు తప్పదిక సోజా

మెరుపులా.. లా.. లా…  ఆడతా.. తా.. తా
పిడుగులా .. లా.. లా… రేగుతా.. తా.. తా
దమ్ముంటే కాస్కో  చాలెంజి చేస్కో
డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం:  చక్రవర్తి
సాహిత్యం:  వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

సాకీ:
పైట జారే పడుచు రాగాలలోనా
పాటలొచ్చే చిలిపి భావాలలో…

పల్లవి:
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను

చరణం: 1 
సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా
పూలే ఈల కొట్టగా కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా
ఓ..ఓ.. అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేసాను మల్లెపూలు
మంచంలో ఆరేస్తాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను

చరణం: 2
ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి
నాలో ఆగకున్నవి జాజి తీగెలా నిన్ను అల్లుకోనా
ఓ..ఓ..ఓ.. చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా
తాళాలే దాటించాలి తందనాలు
ఓ.. తాపాలే తగ్గించాలి చందనాలు
ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
వాటేసి చేసేస్తాలే వందనాలు

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను

కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను