చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: పార్థ
నటీనటులు: ఉదయ్ కిరణ్, సదా
దర్శకత్వం: తేజ
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 06.04.2005
నడుమే ఉయ్యాల నడకే జంపాల
నడుమే ఉయ్యాల నడకే జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
సరాసరి కుమారిపై కళ్ళు పడేలా
ఒ ఎకా ఎక్కి నసాడమే అంటుకునేలా
జుర్రుమనేలా జివ్వుమనేలా
సోకే సునా పెడ పాన్ మసాలా
అంత ఇదేలా కింద పడేలా
బాల బరంపురం భంగిమలెలా
నడుమే ఉయ్యాల నడకే జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
చెడమడ చిరాకుల చంపక మాలా
ఒ ఎడపెడ హడావిడ చంపకిలాగా
ఊరె వినేలా బోడి సవాలా
పోవె పిఠాపురం కంతి తపాలా
పోరి ఇవాలా నాతో మజాలా
రావె సికాకుళం సిల్కు రుమాలా
నడుమే ఉయ్యాల నడకే జంపాల
సరుకే ఊగేల తకదిమితలాల
వామ్మో ఎగాదిగి జిగేలని అందాల
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
జనమే వెంటపడేలా
జడతో ఫ్రెంచి పిడేలా
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఎస్.పి.బి.చరణ్ , ఉష
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ
నీ వైపల చూస్తుంటె ఆకలేయకుందీ
నీ చూపులొ బంధించె మంత్రమేమున్నదీ
నీ మాటలే వింటుంటె రోజు మారుతుందీ
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నదీ
మనసెందుకొ ఇలా మూగవోతోంది రాప
తెలియదు
మరుమల్లె పూవులా గుప్పుమంటోంది లోన
తెలియదు
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ
నీ నీడలొ నేనున్న చూడమంటున్నదీ
ఈ హాయి పేరేదైనా కొత్తగా ఉన్నదీ
నా కంటినె కాదన్నా నిన్ను చూస్తున్నదీ
నేనెంతగ వద్దన్న ఇష్టమంటున్నదీ
మరి దీనినే కద లోకమంటుంది ప్రేమ
తెలియదూ
అరె దూరమంటూనే చేరువౌతుంది రామ
తెలియదూ
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు …
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: సందీప్ , ఉష
ప్రేమించానని చెప్పనా
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
ప్రేమించానని చెప్పనా
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
పైర గాలి నీలా తాకి పోయె వేళా
ప్రేమలో పులకింతలె అనుకోనా
నీలినింగి నీలా మారి పోయె వేళ
లోకమె ప్రియురాలని అనుకోనా
ఊహలోన తేలీ వేల ఊసులాడీ
శ్వాసలాగ మారీ గుండెలోన చేరీ
తీపి ఆశలే చెప్పనా
ప్రేమించానని చెప్పనా
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా
నాలో ఊసులు చెప్పనా
దూరమైన గాని భారమైన గాని
నీడల నిను వీడదె తొలి ప్రేమా
గాలివానె రాని గాయమైనా కాని
హాయిగ చిగురించద మన ప్రేమా
గుండె ఆగిపోనీ గొంతు ఆరిపోనీ
కాలమాగి పోనీ నేల చీలిపోనీ
ప్రేమ పోదనీ చెప్పనా
ప్రేమించానని చెప్పనా
మనసిచ్చానని చెప్పనా
నాలో ఆశలు చెప్పనా
నాలో ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కే. కే, ఉష
కానరాని దైవమా జలిలేని కాలమా
ప్రేమించుకుంటే నేరమా…
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో
ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా
అయ్యో పాపం గోరింకా లోనే ఉందిగా
అయినా పాపం చిలకమ్మా చూడేలేదుగా
ఆశే నీరై కన్నీరై ఏరై పారినా
ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా
పూత పూసినా పూజ చేసినా
రాత మారునా దైవమా
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా
ప్రాణం లేని నీడైనా దూరం కాదుగా
గాలికి పోయే గాలైన గదిలో దాగునా
అర్ధంకాదే ఏనాడూ మసలీ వేదన
ఏమి చేసినా ఎవ్వరాపినా ప్రేమ ఆగునా దైవమా
అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింకా
తన వెనకే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట
ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో
లోకమే ఏకమయ్యి ఒప్పుకోని రేయిలో
ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో
ప్రేమా ఓ ప్రేమా ఇది నీ మాయేనా
ప్రేమా ఓ ప్రేమా జత కలుపే మైనా
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్. పి. పట్నాయక్
ఔనన్నా కాదన్నా నీతోనే నేనున్నా
ఔనన్నా కాదన్నా నీలోనే నేనున్నా
నీ చెలిమే ఓ కాలి వంతెనరా
నీ వినతే చిరుగాలై వస్తున్నా
నీ పిలుపే రోజంతా వింటున్నా
వేదనలో స్వప్నాలే కంటున్నా
ప్రేమైనా చావైనా…
నీ తోనే ఏమైనా…
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష
మలినం కానిది ప్రేమ మరణం లేనిది ప్రేమ
శాశ్వత మైనది ప్రేమ మనసే చిరునామా
గుండెల సందడి ప్రేమ ఆశల పందిరి ప్రేమ
ఓటమి లేనిది ప్రేమ జయమే ఎపుడైనా
గాయం చేస్తే భాదకు బదులు బంధం పుడుతుంది
దూరం చేస్తే బంధం ఇంకా బలపడి పోతుంది
ప్రేమను కోరే మనిసెపుడు ఒరిగే వీలుంది
మనసును మీటే ప్రేమెపుడు నిలిచే ఉంటుంది
ఔనన్నా కాదన్నా…
ప్రేమకోసం మళ్ళి మళ్ళి ప్రేమే పుడుతుంది
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: శంకర్ మహదేవన్
నేల తల్లి గుండెలో…
ఎన్ని వేల పాటలో…
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరి జనం ఊగేలా నాగస్వరం ఊదాల
మద్దిల దరువెయ్యాలా తుళ్ళి పడేలా
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఈ పల్లె పదాలే నోరారా అనాలి
తప్పెట్లే పడాలి రాగానికి
జాబిళ్ళి వినాలి నేలకదే దిగాలి
జజ్జినకడి జనారే తాళానికి
వానమ్మ చిందేసి ఆడాలిరా
వెన్నెల్లో గోదారి వెల్లువయ్యేలా
కొండమ్మ కోనమ్మ మోగాలిరా
ఈ గాలి ఈ నేల పల్లవయ్యేలా
తప్పెటలే మోగాల ఉప్పెనలే రేగాల
పాట విని పల్లెమ్మ వెంట పడాల
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
ఊరంతా వినాలి అబ్బబ్బో అనాలి
కానుకలే ఇవ్వాలి ఈ పాటకి
చిన్నారి చకోరి వాలు కళ్ళు వయ్యారి
వెంట మరి పడాలి సయ్యాటకి
ఈ బుజ్జి భూగోళం ఊగాలిరా
పాపాయిలా పాట ఉయ్యాలలో
పైనున్న ఆకాశం వంగాలి రా
తాతయ్యలా ఈడు తైతక్కలో
మూల నున్న అమ్మమ్మ
మూడుకాళ్ళ ముసలమ్మ
పాట విని రోజంతా చిందులెయ్యాలా
పాటే వింటే ఊపే రావాలిరా
తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా
చిందులేసి ఆడాలిరా
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా
********* ********* ********
చిత్రం: ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర , భాస్కర్, మల్లికార్జున్
సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా
కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి
చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో
మది ఊయల లూగే నమ్మా ఊహాలలో
సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
ప్రేమ కలిపింది మనసిచ్చిన నెచ్చలితో
తోడు దొరికింది ఎద నోచిన నోములతో
దూరములు దూరమయ్యే ఊహల పల్లకిలో
మాటలిక పాటలయ్యే తియ్యని పల్లవిలో
మనసంతా సంతోషం
మనసంతా ఆనందం
సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
నేల మురిసింది శుభలేఖలు అందుకొని
వాన కురిసింది ఇక చల్లగ ఉండమని
వేణువులు వేదమయ్యే నీ జత చేరమని
తారకలు తాళి తెచ్చే ఇక తోడుగ సాగమని
అందుకని ఔనన్నా
వదలనుగా కాదన్నా
సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ
మాఘమాస మొచ్చేనమ్మ
సంబరాలు తెచ్చెనమ్మా గుండె గూటికి
పెళ్ళి మాట చెప్పి కోయిలమ్మ ఆశలెన్నొ రేపెనమ్మా
కొత్త కాంతి తెచ్చెనమ్మా కంటి పాపకి
చిరు నవ్వుల వానలలో మరుమల్లెల వాకిలలో
మది ఊయల లూగే నమ్మా ఊహాలలో
పెళ్ళికల వచ్చెనమ్మా పిల్ల సిగ్గుకి
బుగ్గ చుక్క పెట్టారమ్మా ముద్దుగుమ్మకి