చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , మహాలక్ష్మి అయ్యర్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి
దర్శకత్వం: తిరుపతి సామి
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 29.09.2000
పల్లవి:
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
చరణం: 1
ఓ… నిను చూడనీ నిశిరాతిరి
నిదరైనపోని కనుల పాపవో
ఒహో హో… నిను తాకని నిమిషాలలో
కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
చరణం: 2
ఓ… మలి సందెలో నులి వెచ్చగా
చలి దాచుకున్న చనువే హాయిలే
ఓ… నడిరేయిలో నడుమెక్కడో
తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ… వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
********* ********* *********
చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, హరిహరన్
పల్లవి:
సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నేనుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి
పిలిచిందమ్మా పురుషా అంటూ
మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై
ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నేనుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
చరణం: 1
నా ఊహలో పుట్టుకొచ్చాడే ఊరించే ఈ కళ్ళతో
ఏ దాహమో పుట్టుకొచ్చిందే ఎన్నెళ్ళ ఎంగిళ్ళతో
వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో
ఆమె కనపడితే ఎన్ని కుతకుతలు సందేళలో
ఏమీ తోచదు పొద్దు పోదురా ముద్దు చేసిపోరా
రెప్పే వాలదు రేపు రాదులే
తుళ్ళే పాపా ఒళ్ళొకొచ్చెయ్ వే…
ఓయమ్మో మా యమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నీవుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
చరణం: 2
సంపెంగ పువ్వంటి నీ ముక్కు చల్లింది గంధాలు కౌగిట్లో
సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు నిను చేర రమ్మంది చీకట్లో
దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో
వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో
కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే
దిండు కాపురం చెయ్యలేదులే
పాలు పండు అన్నీ నీతోనే…
ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలో
చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు
చెలి నీవుగా తొలిసారిగా
చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి
పిలిచిందమ్మా పురుషా అంటూ
మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై
ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో
********* ********* *********
చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సుఖ్విందర్ సింగ్, చిత్ర
హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
చీర దులిపేసే చూపులకు జోహారు
సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు
ఒహో హోహో హోహో హోహోహో (2)
హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
లలల లాలా లాలా లలలా (2)
చరణం: 1
ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు
తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు
మంచాలలో మల్లె కంచాలలో
వండి వార్చాను వయ్యారి నా తళుకులు
చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో
దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు
గుట్టు రైక ముడి పట్టు కదా నా పరువు
అది ఫట్టుమనే బీటు కదా నా దరువు
ఒహో హోహో హోహో హోహోహో (2)
హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
చరణం: 2
ఒత్తిడిలో ఒక్క క్షణం
చిత్తడిలో అగ్ని కణం
అందుకనే ఆడతనం
ముద్దులకే మూలధనం
ఈడన్నది పుంజు కోడైనది
దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో
తోడన్నది కొత్త జోడైనది
దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో
కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా
ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా
ఒహో హోహో హోహో హోహోహో (2)
హాయ్ హాయ్ నాయకా అత్తమ్మ కొడకా
నా సొత్తు యావత్తు నీదింక
హే సై సై బాలిక అందాల చిలక
నీ సోకు నాజూకు నాదింక
చీర దులిపేసే చూపులకు జోహారు
సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు
ఒహో హోహో హోహో హోహోహో (2)
లలల లాలా లాలా లలలా (2)
********* ********* *********
చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి.బాలు, సుజాత
పల్లవి:
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క (2)
చెమ్మ చెక్క చెమ్మ చెక్క (2)
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
పెళ్ళి సందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
చరణం: 1
ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి
సంబరంగ చూస్తారంట
కన్న వారు వచ్చి కన్నె దానమిచ్చి
కంటనీరు పెడతారంట
తడి కళ్ళే ప్రమిధలుగా వెలిగే పందిరిలోన
పరవళ్ళే అందెలుగా ఆడే అనందాన
పిట్ట కూత పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ
హేయ్ పిల్ల గాలి పెళ్లి పెద్దయ్యింది పన్నీరు చల్లిస్తూ
పెళ్లి సందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
చరణం: 2
పట్టు చీర కట్టి పూల జడ చుట్టి కొత్త కళ మురిసే వేళ
వాన విల్లు వంటి జాణ వన్నెలంటి వెయ్యి కళ్ళు మెరిసే వేళ
నిలువెల్లా విరిసింది పులకింతల పూదోట
విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట
ఆడ జన్మ మేలుకుంది చూడు సరికొత్త రూపంతో
ఓయ్ అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో
పెళ్లి సందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
పెళ్ళి సందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
******** ******** ********
చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, వసుంధరా దాస్
పల్లవి:
సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
యమరే అదిరే నీ అందం నాతో జమరే
కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
చరణం: 1
చిన్న ముళ్ళు వెనకాల పెద్దముళ్లు తీరగాల
కన్నె పిల్ల వెనకాల కుర్రవాడు నడవాలి
పన్నెండైతే పెనవేయాలి హో హో హో హో
సమయం అక్కడ స్టాప్ అవ్వాలి హో హో హో
ఒడిలో వడిగా మొదలవని టిక్ టిక్ గొడవే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
హేయ్ జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే
చరణం: 2
నవ్వులోనే పుడుతుండే అరె వెయ్యి వాట్ల విద్యుత్తే
నీ హార్ట్ బాటరీ లోనే అది అట్టిపెట్టుకో అంటే
బిల్లులు కట్టే బాదే మాయం హో హో హో హో
చార్జిలు పెంచితే మనకే నష్టం హో
నాకే ఓకే నీ పవరింకొకరికి షాకే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
అరె సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే
జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
యమరే అదిరే నీ అందం నాతో జమరే
కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే
అరె హాయ్ అరె హాయ్
అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
********* ********* *********
చిత్రం: ఆజాద్ (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: అబిజిత్
కొయిల కొయిల కొయిల
కొయిల కొయిల కొయిల హోయ్ (2)
దమ్మరధం కదిలింది రధం చిరునవ్వుతో చెప్పేయ్ టాటా
బ్రహ్మకదం కలిపింది రిథమ్ పట్టాలను ఎక్కిన బాట
దుమ్మురేపుతూ రేగాలి బతుకు బండి సాగాలి
పలకరింతలే కావాలి పులకరించి పోవాలి
కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (4)
రెక్కలనే విప్పుకొని చుక్కలతీరం చేరుకొనే
గువ్వలలో ఆశబలం
ఉప్పెనకే ఎదురీదే ఊపిరి సలపని ఈతల్లో
చేపలకే ఉంది జయం
చుర చుర చూపుల సూర్యుడు పరుగాగేనా ఓ ఓ
సిరి సిరి వెన్నెల చంద్రుడు వెలుగారేనా
కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (4)
అమ్మా బైదెళ్ళినాది తల్లి బైదెళ్ళినాది
చెల్లి బైదెళ్ళినాదో
అన్నా బైదెళ్ళినాడు నాన్నా బైదెళ్ళినాడు
తమ్మి బైదెళ్ళినాడో
గుప్పుమనే గంధంతో విచ్చుకొనే పువ్వులకే
తెలియదులే గమ్యం
పచ్చదనం పరుచుకొని పంటగ మారే పడుచుదనం ప్రాయమనే కావ్యం
ఎవరికి వారే యమునా తీరే అయినా ఓ ఓ
తొలకరి ఆశల పయనం దిశ మారేనా
కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (2)
దమ్మరధం కదిలింది రధం చిరునవ్వుతో చెప్పేయ్ టాటా
బ్రహ్మకదం కలిపింది రిథమ్ పట్టాలను ఎక్కిన బాట
దుమ్మురేపుతూ రేగాలి బ్రతుకు బండి సాగాలి
పలకరింతలే కావాలి పులకరించి పోవాలి
కొయిల కొయిల కొర కొయిలా
కొర కొయిల కొయిల కొర కొయిలా (6)