Baahubali 2: The Conclusion (2017)

Advertisements
చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: సాహితి కోమందురి (సోనీ), దీపు
నటీనటులు: ప్రభాస్, రాణా, అనుస్కా, తమన్నా
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 28.04.2017

ఓరోరి రాజా వీరాది వీరా
ఓరోరి రాజా వీరాది వీరా
నీతోనే నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాకా నేను కూడ రానా
హాయైన హంసనావలోన
నీ గాలి సోకుతుంటే పైన
మెచ్చిందిలే దేవసేనా…

నే నీ ఎదపై విశాల వీర భూమి పై వశించనా
నేనే వలపై వరాల మాలికై వాలనా
నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా
నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా
ఏకాంత కాంత మందిరానా
నీ బాహు బాహు బంధనానా
నూరేళ్లు బందీని కానా…

ఓరోరి రాజా
ఓరోరి రాజా వీరాది వీరా
నీతోనే నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంసనావలోన
నీ గాలి సోకుతుంటే పైన
మెచ్చిందిలే దేవసేనా…

చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: శ్రీనిధి, వి. శ్రీ సౌమ్య

మురిపాల ముకుందా…
సరదాల సనందా…
మురిపాల ముకుందా – సరదాల సనందా
మురిపాల ముకుందా – సరదాల సనందా
పొద పొద లూదు దాగుడు ముతలాపరా
ఎద ఎద లూదు నటించింది చాలురా
అలచట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా
చిటెకెను వేలిని కొండని మోసిన
కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండను దోచిన
కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా

గోపెల వలువలతో జలది అలసే వేళ
గోవుగ శయనించు
పొంగిలి వెన్నలపై ఉరికే ఉబలాటముకి
ఊరట కలిగించు
శ్యామలా… నా మోహన
చాలు చాలు నీ ఇట మటలు
పవలించక తీరవు అలసటలు
విరిసే మదిలో విరి సెయ్యను

కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా

నెర నెర చూపులకే కరిగి కదిలి
నీకై బిర బిర వచ్చితిని
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి
తమకము తెలిపితిని
మాధవా… యాదవా…
నా మతి మాలి దోషము జరిగే
ఓ వనమాలి ఎటు నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా…

కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా – నా కన్నా నిదురించరా

మురిపాల ముకుందా సరదాల సనందా
మురిపాల ముకుందా సరదాల సనందా
మధనా మధుసూధన మనోహర మన్మోహన
మధనా మధుసూధన మనోహర మన్మోహన
మురిపాల ముకుందా సరదాల సనందా

ఆనందా… అనిరుద్దా… (2)

మురిపాల ముకుందా సరదాల సనందా
కన్నా…. రాధా రమణ కన్నా… నిదురించరా…

చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: కాల భైరవ

Advertisements

పరమడ కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
పరమడ కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి
కలలో దేవుడిలా కాపై ఉంటావా
నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం
నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా

దండాలయ్యా  దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా  దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా

తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకొంటూ
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా
కడు చిందించే చెమటను తడిసే
పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా
నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే
మా ఆయువు కూడా నీకయ్యా

దండాలయ్యా  దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా  దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా

చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: కాల భైరవ

ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం
ఒక పాశం తన నిస్టై రగిలిందా రణతంత్రం
హలనంతోనే మొదలయ్యిందా హావనం లో జ్వలనం
శభాష్ అనే నభం
రారా రమ్మని రారా రమ్మని పిలిచిందా రాజ్యం
వరించరా జయం సాంతం
తొలి తానై ఉరి తాడై అరిచేనా…
భవితవ్యం రుధిరంలో రునబంధం
ప్రతి బొట్టు శైవం – శివం

చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: , కె. శివశక్తి దత్తా, డా౹౹ కె. రామకృష్ణ
గానం: దలెర్ మెహంది, యమ్. యమ్. కీరవాణి, మౌనిమ

భళి భళి రా భళి
సాహోరే బాహుబలి
భళి భళి రా భళి
సాహోరే బాహుబలి
జయ హారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్ని జై కొట్టాలి
గగనాలే ఛత్రం పట్టాలి

హేయ్ స రుద్రస్స హైసరబద్ర సముద్రస్స (4)

ఆ జనని దీక్షా అచనం
ఈ కొంగుకి కవచం
ఇప్పుడా అమ్మకి అమ్మా అయినందుకా
పులకరించిందిగా ఈక్షణం

అలముదు పుట్ట నిట్ట కవ్వించు
పిడికిట పిడుగు పట్టి మించు
అధికుడవంట గుట్కాల్ చేయించు
అవనికి స్వర్గాన్నే దించు

అంత మహా బలుడైన అమ్మవడి పసివాడే
శివుడైన భవుడైన అమ్మకు సాటి కాదంటాడే

హేయ్ స రుద్రస్స హైసరబద్ర సముద్రస్స (9)

భళి భళి రా భళి
సాహోరే బాహుబలి
భళి భళి రా భళి
సాహోరే బాహుబలి
జయ హారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్ని జై కొట్టాలి
గగనాలే ఛత్రం పట్టాలి

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Aatma Gowravam (1965)
error: Content is protected !!