చిత్రం: బాబు (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల, రమోల
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మీ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: ఎ. ఎల్.కుమార్
విడుదల తేది: 1975
పల్లవి:
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది.. సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది.. సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
బూరెలంటి బుగ్గల్లో ఎరుపొచ్చింది.. పువ్వులంటి కన్నుల్లో మెరుపొచ్చింది
ఛీ పో.. ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది.. సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
చరణం: 1
దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు
దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు
తప్పదులే తలంబ్రాలు… ఆ పైన తిరునాళ్ళు
తలచుకొని తలచుకొని నిదురరాని నీ కళ్ళు
తలచుకొని తలచుకొని నిదురరాని నీ కళ్ళు
తెల్లారిపొతాయి చెంగల్వ రేకులు… తెల్లారిపొతాయి చెంగల్వ రేకులు
అబ్బా.. ఊరుకో.. ఓయమ్మో ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
చరణం: 2
పూలజడ వేసుకొని బుగ్గచుక్క పెట్టుకుని
పూలజడ వేసుకొని బుగ్గచుక్క పెట్టుకుని
బొలెడన్ని ఆశలతో బోధపడని బెదురుతో..
తడబడుతూ గదిలోకి అడుగు పెట్టగానే..
తడబడుతూ గదిలోకి అడుగు పెట్టగానే..
యిలా.. అబ్బా.. వాటేసుకుంటాడు వాటమైన మొనగాడు
వాటేసుకుంటాడు వాటమైన మొనగాడు
ఛీ పో.. ఓయమ్మో.. ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది
సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది
***** ****** ******
చిత్రం: బాబు (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల, వి.రామకృష్ణ
పల్లవి:
ఒక జంట కలిసిన తరుణాన..
జే గంట మ్రోగెను గుడిలోన.. ఆ హ్రదయాల శ్రుతిలోన
ఒక జంట కలిసిన తరుణాన..
జే గంట మ్రోగెను గుడిలోన.. ఆ హ్రదయాల శ్రుతిలోన
చరణం: 1
కలిమి లేమి జంటలనీ.. అవి కలకాలంగా ఉన్నవనీ
కలిమి లేమి జంటలనీ.. అవి కలకాలంగా ఉన్నవనీ
ఋజువు చేయమని మన ఇద్దరినీ.. కాలం నేటికి కలిపెననీ
వెలుగూ నీడగ ఉండమనీ..
వెలుగూ నీడగ వుండమనీ.. వలపు గెలుపుగా గుర్తుండమని
ఒక జంట కలిసిన తరుణాన..
జే గంట మ్రోగెను గుడిలోన.. ఆ హ్రదయాల శ్రుతిలోన
చరణం: 2
పెద్దరికానికి పేదరికానికి ప్రేమే నిలబడి పెళ్ళి చేసెను.. ఆ.. ఆ… ఆ..
పెద్దరికానికి పేదరికానికి ప్రేమే నిలబడి పెళ్ళి చేసెను
సూర్యచంద్రులు వెలిగే వరకూ తారలన్నీ మెరిసే వరకూ
సూర్యచంద్రులు వెలిగే వరకూ తారలన్నీ మెరిసే వరకూ
జాతి మతాలూ సమసే వరకూ.. జన్మలన్నీ ముగిసే వరకూ
శతమానం భవతీ.. శత శతమానం భవతీ.. తధాస్తు.. తధాస్తు.. తధాస్తు..
ఒక జంట కలసిన తరుణాన.. ఒక గుండె రగిలెను ద్వేషాన
ఆ హ్రుదయాలు విడదీయు పంతాన
తరతరాల ఈ వంశ గౌరవం తగులబెట్టినావు
చరణం: 3
తరతరాల ఈ వంశ గౌరవం తగులబెట్టినావు
తాళిగట్టి ఈ దరిద్రాన్ని నీ వెంట తెచ్చినావూ
అని గర్జించిందొక కన్న తండ్రి కంఠం
సిరి సంపదలు నిలకడకావు.. పరువు ప్రతిష్టలు వాటితో రావు
మాట తప్పడం కాదు గౌరవం.. మనసు మమతే మనిషంటే
అని మనవి చేసె నొక కన్నబిడ్డ హ్రుదయం
కులమూ కులమూ జాతీ జాతని గాండ్రించిందా పెద్దతరం
గుణమే కులమని నీతే జాతని వాదించిందా యువతరం
తండ్రీ కొడుకుల బంధం నేటితో తెగిపొతుందీ
అనురాగపు అనుబంధం తలవంచక వుంటుంది
పోరా పో పోతే పో.. నాశనమై పో.. పోతుందీ వంశం నా తోనే పోనీ.. పోనీ.. పోనీ .. పోనీ
***** ****** ******
చిత్రం: బాబు (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
అయ్య బాబోయ్…
అయ్య బాబోయ్ అదిరిపోయింది… అయ్య బాబోయ్ అదిరిపోయింది
ఆడపిల్లతో ఇలాగేనా ఆటలాడేది చెలగాటమాడేది?
అమ్మబాబోయ్..అదురుపుట్టింది.. అమ్మబాబోయ్ అదురుపుట్టింది
హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది.. ఇంతకన్న ఏమిచేసేది?
చరణం: 1
కొలతలన్నీ తెలిసినవాడా… కొత కోసి కుట్టేవాడా.. బాబోయ్…
కొలతలన్నీ తెలిసినవాడా… కొత కోసి కుట్టేవాడా..
కుర్రదాని కోర్కెలన్నీ కొలిచి చూస్తావా.. గుండె కోస్తావా?
షోకులమ్మె షాపులోన ఫోజులిచ్చే పిల్లదానా
గాజు బొమ్మకు చీర కడితే..
గాజు బొమ్మకు చీర కడితే.. మోజు పుడుతుందా? ముద్దు వస్తుందా?
అయ్య బాబోయ్ అదిరిపోయింది… అమ్మబాబోయ్ అదురుపుట్టింది
చరణం: 2
నడుము చూడు ఇరవై అయిదే… ఛాతీ కొలత ముప్పై అయిదు
రెండు కలిపి లెక్క వేసి మనసు లొతెంతో తెలుసుకుంటావా?
చూపుతోనే లెక్కగట్టి వయసు ఎంతో చెప్పగలను..
మనసు లోతు చెప్పజాలనీ..
మనసు లోతు చెప్పజాలనీ… మనిషినేనమ్మా.. మరిచిపోవమ్మా
అయ్య బాబోయ్ అదిరిపోయింది.. అమ్మబాబోయ్ అదురుపుట్టింది
హద్దుమీరితే ఆడదాన్ని ఏమి చేసేది? ఇంతకన్న ఏమిచేసేది?
***** ****** ******
చిత్రం: బాబు (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
ఏయ్.. బాబూ.. నిన్నే..
ఊ.. హు.. బాగుందా..?
అబ్బా.. ఎంత బాగుంది..
ఎంతా…?
ఎంతో…ఓ..ఓ..
హ్హ హ్హ హ్హ.. ఎంతో అంటే..?
హ్హ హ్హ హ్హ.. ఊ..ఊ…ఊ.. ఇంత..
హ్హ హ్హ హ్హ.. హ్హ హ్హ హ్హ
ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు..
ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు… నాకున్నవేమో రెండే కన్నులు
ఎలా.. ఎలా.. ఎలా చూసేది?.. ఏది చూసేది?
ఎలా చూసేది..? ఏది చూసేది?
చాలకుంటే…
ఆ..హా..
కావాలంటే…
ఓహో..
చాలకుంటే.. కావాలంటే.. నావి కూడ తీసుకో..
తనివి తీరా చూసుకో..
నీ తనివి తీరా చూసుకో..
చరణం: 1
ఆ…హా.. ఆ..హా. ఆ..హా..హా..ఆ..హా…హా..హా
ఓ..హో.. ఓ..హో..ఓ..హా హా ఓ..హో..హా..హా
ఈ ఎరుపు బాగుందా.. తెలుపు కుదిరిందా?
ఈ ఎరుపు బాగుందా.. తెలుపు కుదిరిందా?
ఎరుపులో నీ వయసుంది.. ఆ హా…
తెలుపులో నీ మనసుంది..
ఎరుపు తెలుపులు నన్ను నిలువునా నలుపుతున్నాయి..
అమ్మొమ్మో.. ఎదలో సలుపుతున్నాయి..
ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు… నాకున్నవేమో రెండే కన్నులు
చాలకుంటే.. కావాలంటే.. నావి కూడ తీసుకో..
తనివి తీరా చూసుకో.. నీ తనివి తీరా చూసుకో..
చరణం: 2
పంతులమ్మ.. పంతులమ్మా కొత్త చదువు నేర్పుతావా
దర్జీ దొరా.. దర్జీ దొరా.. వలపు కొలత తీస్తావా..
నింగీ నేలా.. నిండు మనసు.. నీకు నాకూ వలపు కొలత
కొలతలన్నీ చెరిపి వేసే.. చెలిమిలోనే కొత్త చదువు
ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు… నాకున్నవేమో రెండే కన్నులు
ఎలా.. ఎలా.. ఎలా చూసేది..?
ఎలా చూసేది..? ఏది చూసేది..?
చరణం: 3
నీ చిలిపి కన్నుల్లో.. చిగురు పెదవుల్లో..
నవ్వు నువ్వై నిలవాలి.. నువ్వు నేనై కలవాలి
కనులు.. పెదవులు.. కలిసి మెలిసి కౌగిలించాలి..
అమ్మొమ్మో.. కరిగి పోవాలి..
ఎన్నెన్ని వంపులు.. ఎన్నెన్ని సొంపులు… నాకున్నవేమో రెండే కన్నులు
చాలకుంటే..కావాలంటే.. నావి కూడ తీసుకో..
తనివి తీరా చూసుకో..
నీ తనివి తీరా చూసుకో..