చిత్రం: బాలనగమ్మ (1959)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, జిక్కి
నటీనటులు: యన్. టి.రామారావు, అంజలీ దేవి, ఎస్.వి.రంగారావు
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాతలు: బి.ఎస్.రాజు, డి.ఎల్.రాజు, పి.వెంకటపతి రాజు
విడుదల తేది: 09.10.1959
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
వలపు పూబాల చిలికించెను గారాల
వలపు పూబాల చిలికించెను గారాల
అలా చిరుగాలి సోకున మేను తూలె నందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
జగతి వినుపించే యువ భావాలు చిందాయి (2)
ఇలా పులకరించెనీయాల సోయగాలనందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
ఆహా హ…