చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: శోబన్ బాబు , రాజశేఖర్, జగపతిబాబు , రమ్యక్రిష్ణ
దర్శకత్వం: రవి రాజ పినిశెట్టి
నిర్మాత: సుంకర మధు మురళి
విడుదల తేది: 07.11.1992
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే
లాలిజో స్వరాలలో వినీలమేఘమాల నీడలో
తాల వేణు ఊదుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే
వయసుకు చలివో ప్రియ చెలివో తెలియదుగానీ
చిలకల తోలిపే మనసిపుడు తెలుపవే
వలపుల వలవో ఒక కలవో ఎరుగనుకానీ
కనులలో వెలిగే కాంతులిపుడు తెలిసెలే
నీ లయా……..ఎదకే లయా
నీ దయా……… చెలిమీ దయా
కోకిలమ్మ పెళ్లి విందు కొమ్మలన్నీ కోరుకున్నా
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే
ఒకరికి ఒకరై శ్రుతి ఒకటై బ్రతుకోకపాటై
పలికిన జతకి తొలిపలుకు వలపులే
మనసున మనసై ఒక మనిషై మరువనితోడై
నడిచిన కథలో అడుగడుగు మమతలే
మల్లిలా……. విరజల్లులా
వెల్లువా…… హరివిల్లువా
మోజులమ్మ రోజుక్కొక్క మేజువాని చేసుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే