Balipeetam (1975)

balipeetam 1975

చిత్రం:  బలిపీఠం (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: ఎస్.పి. బాలు
నటీనటులు: శోభన్ బాబు, శారద, మురళీమోహన్
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వై.సునీల్ చౌదరి
విడుదల తేది: 1975

పల్లవి:
కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ.. తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ
కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట

చరణం: 1
కార్యశూరుడు వీరేశలింగం  కలంపట్టి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను తుదముట్టి౦చిన అగ్నితరంగం
అడుగో.. అతడే.. వీరేశలింగం   

మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే
బ్రతుకే తెలియని బాల  వితంతువుకెందుకు లేదా హక్క౦టాను

చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు…..
మోడు వారిన ఆడబ్రతుకుల పసుపూ కుంకుమ నిలిపాడు.. నిలిపాడు
కలసి పాడుదాం తెలుగు పాట…  కదలి సాగుదాం వెలుగుబాట

చరణం: 2
అడుగో.. అతడే.. గురజాడ
మంచిచెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు
మంచిచెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు
మంచియన్నది మాలయైతే… మాల నేనౌతాను.. మాల నేనౌతాను అన్నాడు…..

కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ…  తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ
కలసి పాడుదాం తెలుగు పాట… కదలి సాగుదాం వెలుగుబాట

*******  ******  *******

చిత్రం: బలిపీఠం (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  దాశరథి
గానం:  వి. రామకృష్ణ, సుశీల

పల్లవి:
చందమామ రావే.. జాబిల్లి రావే
అమ్మాయి అలిగింది.. అలక తీర్చిపోవే.. అలక తీర్చిపోవే

చందమామ రావే.. జాబిల్లి రావే
అబ్బాయి నోటికి.. తాళమేసి పోవే.. తాళమేసి పోవే
చందమామ రావే

చరణం: 1
చల్ల గాలి ఝడిపిస్తోంది.. ఎలాగా ?
గళ్ళ దుప్పటి కప్పుకోండి.. ఇలాగా..
పండు వెన్నెల రమ్మంటో౦ది.. ఎలాగా?
తలుపు తీశా వెళ్లిరండి.. ఇలాగా..

అందాల ఈ రేయీ వెళతాను అంటో౦ది
ఇద్దరిని ఒక్కటిగ చూడాలి అంటో౦ది
ఏదో వంకతో ఎందుకు పిలవాలి? .. కావాలంటే సూటిగానే అడగలేరా
చందమామ రావే..

చరణం: 2
అమ్మాయి పుడితేను.. ఎలాగా?
పెళ్లి చేసి పంపాలి.. ఇలాగా
అబ్బాయి పుడితేను.. ఎలాగా?
గొప్పవాణ్ణి చెయ్యాలి.. ఇలాగా

అమ్మాయి పుట్టినా.. అబ్బాయి పుట్ట్టినా
మీలాగే ఉండాలి.. మీ మనసే రావాలి

తల్లే పాలతో మంచిని పోయాలి
ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి

చందమామ రావే.. జాబిల్లి రావే
పాపాయి పుడితేను..  జోల పాడరావే..
జోల పాడరావే.. చందమామ రావే

*******  ******  *******

చిత్రం: బలిపీఠం (1975)
సంగీతం:  కె. చక్రవర్తి
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు, సుశీల

పల్లవి:
మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారని వాళ్లను.. మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను.. మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి

చరణం: 1
అందరు దేవుని సంతతి కాదా.. ఎందుకు తరతమ భేదాలు
అందరు దేవుని సంతతి కాదా.. ఎందుకు తరతమ భేదాలు

అందరి దేవుడు ఒకడే ఐతే..
అందరి దేవుడు ఒకడే ఐతే.. ఎందుకు కోటి రూపాలు

అందరి రక్తం ఒకటే కాదా.. ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం…. ఒకటే అయితే..
అందరి రక్తం…. ఒకటే అయితే.. ఎందుకు రంగుల తేడాలు

మారాలి మారాలి.. మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి

చరణం: 2
తెలిసి తెలిసి బురద నీటిలో.. ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము.. పుడుతుందని మరిచేరా

కమలం కోసం బురదలోనే.. కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని.. మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు.. సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం.. వారిదే రానున్న యుగం
వారిదే ఈనాటి తరం.. వారిదే రానున్న యుగం
కాదనే వారు.. ఇంకా కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే.. మేలుకోక తప్పదులే
మారిపోక తప్పదులే.. తప్పదులే…

మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారనివాళ్లను.. మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి

*******  ******  *******

చిత్రం:  బలిపీఠం (1975)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  దేవులపల్లి
గానం:  ఎస్.పి.బాలు, సుశీల

పల్లవి:
కుశలమా.. నీకు కుశలమేనా?
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే..అంతే .. అంతే..
కుశలమా.. నీకు కుశలమేనా? –
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను.. అంతే ..అంతే .. అంతే..

చరణం: 1
చిన్న తల్లి ఏమంది? … నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన… పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన.. దేవిగారికొకటి
ఒకటేనా.. ఒకటేనా.. ఎన్నైనా.. ఎన్నెన్నో..
మనసు నిలుపుకోలేక.. మరీ మరీ అడిగాను.. అంతే ..అంతే.. అంతే..
కుశలమా… హాయ్

చరణం: 2
పెరటిలోని పూలపానుపు… త్వర త్వరగా రమ్మంది.
పొగడ నీడ పొదరిల్లో.. దిగులు దిగులుగా ఉంది.
ఎన్ని కబురులంపేనో.. ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా.. నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఆ..  ఒకటైనా..ఆ.. ఆ ఆ
అందెనులే… తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేక – ఏదో ఏదో రాశాను
అంతే .. అంతే.. అంతే..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top