చిత్రం: బందిపోటు (1963)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: బి.విఠలాచార్యా
నిర్మాత: బి.విఠలాచార్యా
విడుదల తేది: 1963
ఓహోహో…ఓ… ఓ…
ఓహోహో… ఓ… ఓ…
ఓహోహోహో… ఓ… ఓ…
వగలరాణివి నీవే సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం
వగల రాణివి నీవే .. ఓహోహో ఓ…
ఒహోహో ఓ..
ఒహోహో ఓ..ఓ..
ఓహోహొ ఓఓఓ
ఓహోహొ ఓఓఓ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె
వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే…
వగల రాణివి నీవే .. ఓహోహో ఓ…
ఓహోహో ఓ…
ఓహోహో ఓఓఓ…
******** ******** *********
చిత్రం: బందిపోటు (1963)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా… ఉఁ…
ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే
వలదన్న వినదీ మనసు కలనైనా నిన్నే తలచు (2)
తొలి ప్రేమలో బలముుందిలే అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే
నను కోరి చేరిన బేల దూరాన నిలిచే వేళ (2)
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా
ఊహలు గుస గుసలాడే నా హృదయము ఊగిసలాడే
దివి మల్లే పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే (2)
మెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడే మన హృదయములూయలులూగే