చిత్రం: బందిపోటు సింహం (1982)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి, నళిని
దర్శకత్వం: యస్.పి.ముత్తురామాన్
నిర్మాత: పి.శ్రీనివాస్
విడుదల తేది: 21.05.1982
కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం
నాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం నీలో మనసు
కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం
నాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం నీలో మనసు
మాటలతోని నను మురిపించి మైమరపించావే
నాకై వేచి వలచి దోచి నను వలచించావే
మాటలతోని నను మురిపించి మైమరపించావే
నాకై వేచి వలచి దోచి నను వలచించావే ననువలచించావే
చూపుల అనుబంధం తోడుగ నిలిచేను
చూపుల అనుబంధం తోడుగ నిలిచేను
నా చెలి అందలే నా మది మసువులు చిలికేను నా మది మసువులు చిలికేను
కులికే అల్లరి అందం ఊరించే మల్లెల బంధం
కొంటె తలపు కొత్త పిలుపు నీలో చెలిమీ వాడని వలపూ
కోరిక తీర జతగా చేరే కోళ్ళను చూడవయా
గుస గుస లాడే పక్షులు కూడా వలపుల సాక్షులయా
కోరిక తీర జతగా చేరే కోళ్ళను చూడవయా
గుస గుస లాడే పక్షులు కూడా వలపుల సాక్షులయా వలపుల సాక్షులయా
పక్షుల గది వేరే మనుషుల స్తితి వేరే
పక్షుల గది వేరే మనుషుల స్తితి వేరే
మనుషుల గతమేలే పక్షుల చెలిమీ సాగదులే పక్షుల చెలిమీ సాగదులే
కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం
నదిలా పరువం పొంగెను చూడు అలలే చెలి పాటా
ఆశలువుంటే మదినాదంటే బ్రతుకే ఒక ఆట బ్రతుకే ఒక ఆట
కాదని అన్నానా రాదని చెప్పానా
వలపుల బంధంలా మెడలో బంధం వేయాలి మెడలో బంధం వేయాలి
కులికే అల్లరి అందం ఆశలు చిలికే మల్లెల బంధం
నాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం నీలో మనసు