Bangaram (2006)

చిత్రం: బంగారం (2006)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: టిప్పు, మానిక్క వినయగం
నటీనటులు: పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రీమా సేన్
దర్శకత్వం: ధరణి
నిర్మాత: ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 03.05.2006

జరుగు జరుగు జరుగు
మనవాడు వచ్చాడోయ్
జరుగు జరుగు జరుగు
మెరుపల్లే వచ్చాడోయ్
జరుగు జరుగు జరుగు
దమ్మున్న చిన్నోడోయ్
జరుగు జరుగు జరుగు
దుమ్ము దులిపేస్తాడోయ్
జరుగు జరుగు జరుగు

రా రా రా రారా బంగారం
అరె నీకు పోటీ లేనే లేదోయ్ బంగారం
ఎవరు ఆహ అన్నా.. ఎవరు ఓహో అన్నా
నువ్వు నీలా ఉంటె మంచి పని చేస్తుంటే
ఈ లోకంలోన నువ్వే అసలు బంగారం…
పది మంది మెచ్చే వాడే మేలిమి బంగారం…

ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా
నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చేయవద్దురా
పక్క వాడి జోలికెపుడు నువ్వు పోనే పోకురా
అడ్డం వచ్చినోడి టాపు లేపి మరి చూపురా
ఎన్ని చారలున్నా అరేయ్ పిల్లి పులై పోదురా..
ఎంత మోగుతున్నా అరేయ్ కంచు కనకం అవదురా
కొట్టు కొట్టు కొట్టు యే కొబ్బరికాయ కొట్టు
దిష్టి తొలగురా బంగారం …
ఆచి బూచి లవ్వలకరి లాంచీ
ధదినకరి దంచి తీసుకుపో దోచి

జరుగు జరుగు జరుగోయ్…

నేను నేను నేనంటూ విర్రవీగమాకు రా
ఎవరిలోన ఏముందో ఎవరికి ఎరుక ఈశ్వరా
గడ్డి పరకైనా భూమిని చీల్చుకునే పుట్టురా
కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా
ఎంత ఎత్తునున్నా అరేయ్ బండ కొండ కాదు రా
ఎంత మందివున్నా బంగారు సాటి రారు రా…
కట్టు కట్టు కట్టు యే పంచకట్టు కట్టు
యిరగతియ్ రా బంగారం

24 (2016)
Previous
24 (2016)