చిత్రం: బంగారు బాబు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ
దర్శకత్వం & నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 15.03.1973
ఛిఛిఛిఛిఛిఛిఛిఛిఛి
ఛఛఛఛఛఛ..ఛ
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ..
అందమంతా చీరలోనే ఉన్నది!!
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ..
కొంగు కొంగు కలిపి చూడమన్నది!!
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ..
అందమంతా చీరలోనే ఉన్నది!!
మెరుపల్లే వచ్చిందీ నా ఇంటికి..
నను మెల్లంగా దించింది ముగ్గులోనికి..
మెరుపల్లే వచ్చిందీ నా ఇంటికి..
నను మెల్లంగా దించింది ముగ్గులోనికి..
తల దాచుకొమని తావిస్తివీ..
తల దాచుకొమని తావిస్తివీ..
పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి!!
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..
అందమంతా చీరలోనే ఉన్నది!!
ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి..
దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి..
ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి..
దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి..
పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు..
పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు..
పిల్లదాని పెదవిమీద కాటు వేసినావు!!
హెయ్..
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..
కొంగు కొంగు కలిపి చూడమన్నది!!
సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి..
అబ్బో సంగీతం వచ్చిందీ బుచ్చిబాబుకీ..
తెరచాటు తొలిగింది పరువానికి..
తెరచాటు తొలిగింది పరువానికి..
అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి!!
సరి సరి సరి సరి సరి సరి సరి సరి
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..
కొంగు కొంగు కలిపి చూడమన్నది!!
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది..
దాని జిమ్మదీయ..
అందమంతా చీరలోనే ఉన్నది!!
సరిససస సగససస సమససస సరి సరి సరిస
సరిససస సగససస సమససస సరి సరి సరిస
సరిససస
సరిససస
సరి సరి సరి సరి సరి సరి సరి స
********** ********* *********
చిత్రం: బంగారు బాబు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి :
ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో… జన్మల అనుబంధం
ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో… జన్మల అనుబంధం
చరణం : 1
ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలిరోజు
అవి మాటలకందక మారాం చేసేదీరోజు
ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలిరోజు
అవి మాటలకందక మారాం చేసేదీరోజు
ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాచినవి
ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాచినవి
ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది
ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది
ఇది… ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో… జన్మల అనుబంధం
చరణం : 2
మోజులు పెరగాలివాటిని చేతలు చెయ్యాలి
సుఖాల లోతులు చూడాలి ఒడిలో సోలిపోవాలి
మోజులు పెరగాలి వాటిని చేతలు చెయ్యాలి
సుఖాల లోతులు చూడాలి ఒడిలో సోలిపోవాలి
అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి
ఎండ వాన రెండూ చూస్తూ పండిపోవాలి
అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి
ఎండ వాన రెండూ చూస్తూ పండిపోవాలి
ఇది… ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో… జన్మల అనుబంధం
చరణం : 3
ఆలుమగలుగ ఆనందం చవిచూశాము
అనురాగం పండి అమ్మానాన్నలమైనాము
ఆలుమగలుగ ఆనందం చవిచూశాము
అనురాగం పండి అమ్మానాన్నలమైనాము
ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది
ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది
ఈ బోసినవ్వుకే మగాడు జోలలు పాడేది
ఈ బోసినవ్వుకే మగాడు జోలలు పాడేది
ఇది… ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం
నిన్ను నన్ను పెనవేసిన బంధం
ఎన్నో జన్మల సంబంధం
ఎన్నెన్నో… జన్మల అనుబంధం