Bangaru Bullodu (1993)

చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , చిత్ర, మినీ మినీ
నటీనటులు: బాలక్రిష్ణ , రవీణా టండన్ , రమ్యకృష్ణ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 03.09.1993

దితొం దితొం
తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ
రాజీ ఉండాలే పిల్లో
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

కమ్మంగా కౌగిట్లో కవ్వించేయ్నా
కసిగా ఉయ్యాలో జంపాలో ఊగించేయ్నా
ఒళ్లోని వైకుంఠం చూపించెయ్నా
అదిరే అందాలే అచ్చంగా అందించెయ్నా
రంభా ఊర్వసులే నా సరి రారురా
రతి నా చెలికత్తె ఇటు రారో
ఇక చాలు చాలు ఆగడాలు అమ్మాయో ఓ ఓ ఓ…
నే వేగలేను రాలుగాయి గుమ్మాయో ఓ ఓ ఓ…
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

చూశా నీ యవ్వారం వన్నెలాడి
నిన్ను గోదాట్లో తొక్కేస్తా గిన్నెకోడి
చాలించే గప్పాలు కుర్ర కేడి
మనతో పందేలు వేశావో చిక్కే బాడి
భరతం పడతాను పదవే పోకిరి
దుమ్ము దులిపేస్తా గయ్యాలి
అరె ఆపు ఆపు తందనాలు చామంతి హొ హొ హో…
నే చూడలేనె కొట్టుకుంటే పూబంతి ఓ ఓ ఓ…
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
హోయ్ వినవే అనులమిన్న తగువే వద్దని అన్న
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ
రాజీ ఉండాలే పిల్లో
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం

*********  *********   *********

చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో… ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది – మధన మన్మది
వలది నేడదీ… –  హా….

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో… ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో  జంటగా చిలక వాలదు

చరణం : 1
ఎద ఉరుకులు పొదలకు ఎరుపట
పొద ఇరుకులు జతలకు చెరుకట
ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ
తొలివలపులు తొలకరి ఋతువట
చలి పిలుపులు చెలిమికి రుజువట
ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ
సొగసరి ఇటు మగసిరి అటు
కలబడినది కసి కాటు…హా
మనసులు ఇటు కలిసినవటు
మనుగడకిది తొలిమాటు
చూపుకు చూపే చుమ్మా
ఊపిరి వెడేకొమ్మా
ముద్దుకు ముద్దె గుమ్మా ముచ్చట నేడే నమ్మా
వయసు లేడిరో – వలపు తాడుతో
నిలిపి చూడరో – హా…

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో…. ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు

చరణం : 2
ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ
రుచులాడిగెను  పెదవిని పెదవులు
కోసరడిగెను వలపుల ముడుపులు
ఓ ఓ ఓ ఓ ….ఓ ఓ ఓ ఓ
తనువడిగెను తపనల తనువులు
జతనడిగెను మదనుడి మణువులు
ఓ ఓ ఓ ఓ ……. ఓ ఓ ఓ ఓ
పులి తగిలిన గిలిరగిలిన శిల
అడిగెను నీ రూపం  హా….
నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం
మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట
తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట
మెరుపు మెడలో
ఉరిమి చూడరో
కరుకు చూపరో
ఆ…. – హా…..

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో… ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది – మధన మన్మది
వలది నేడదీ… –  హా…. – అహ హా

*********  *********   *********

చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా…

ఓహో… ఓహో…

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో – అందాలెన్నో యాలో యాల…

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో – అందాలెన్నో – యాలో యాల…

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Ammo! Okato Tareekhu (2000)
error: Content is protected !!