Bangaru Kalalu (1974)

చిత్రం: బంగారు కలలు (1974)
సంగీతం: సాలూరి రాజేస్వరరావు
సాహిత్యం: దాశరధి కృష్ణమాచార్యులు
గానం: పి.సుశీల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహమాన్, లక్ష్మీ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.మధుసూదనరావు
విడుదల తేది: 04.06.1974

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

కళకళ లాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా
కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా
కళకళ లాడే నీ కళ్ళు దేవుడి ఇళ్ళమ్మా
కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా
నీకోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

ఆటలలో చదువులలో మేటిగ రావాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
నీ పసి హృదయంలో వెన్నెల కాయాలి
నా బంగారు కలలే నిజమై నిలవాలి

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు
నాధుడు కావాలి
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు
నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
నిన్నే నే తలచి నే పొంగిపోవాలి

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి

error: Content is protected !!