చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: చిరంజీవి, రంభ, రచన
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: నాగేంద్ర బాబు
విడుదల తేది: 09.04.1998
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది (2)
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నదీ వెడ్డింగే సిద్ధమైనదీ
పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా
గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా
గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా
ఆంటీ కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
చరణం: 1
ఆదివారమర్ధరాత్రి వేళలో ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారమాడుకున్న ఆటలో ఆ హాయికింక సరిలేదంట
వంటఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుంబలో
ఎట్టా లెక్కెట్టినా పిట్టా నీ ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు ఇటువైపు చూడసాగే వేయికళ్ళు
ముద్దు మురిపాలు అంటే గిట్టనోళ్ళు
మున్ముందు జన్మలోన కీటకాలు
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
చరణం: 2
ఇంచుమించు ఇరువై ఆరు నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం
నిబ్బరంగ డెబ్భై ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
గోల్డ్ చైన్ సాక్షిగా యెన్ని గోటిముద్దలో
హెయిర్ పిన్ సాక్షిగా యెన్ని హాట్ గుర్తులో
కైపే పుట్టించిన చిట్టా ఒకటుందిగా కొండవీటి చాంతాడంతా
పెళ్లే కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా థ్రిల్లేదో నాకు తెలిసే రంగ రంగా
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారెవ్వా ముక్కుపుడక వారెవ్వా
గళ్ళ చొక్క వారెవ్వా కళ్ళజోడు వారెవ్వా
ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నదీ తదాస్థని పందిరన్నదీ
********* ********** **********
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, సుజాత
సారీ సారీ సారీ
సో సారీ సారీ సారీ
హేయ్
సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి మన్నించేయ్ ఈ సారి
నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారి
నువ్వేలేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లెరి ఏయ్ తినిపించాలా కేడ్బరి
అందించాలా స్ట్రాబెర్రీ కొంచం మారాలి నీ వైఖరి
సో సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారి
ప్యారీ బ్రహ్మచారి మన్నించేయ్ ఈ సారి
లవ్వులోన చిన్న తప్పులే కామన్ కమాన్
నవ్వమంటు వేడుకున్నది సాజన్
ఆ నింగి రాలిందా అట్లాంటిక్ పొంగిందా
తూఫాన్ రానుందా అనుబాంబ్ మీద పడనుందా
మూడీగా ఉండొద్దయ్యా నన్నే ముద్దుల్లో ముంచాలయ్యా
హేయ్ దూరంగా వెళ్ళొద్దయ్య నన్నే ఘాడంగా వాటెయ్ ప్రియా
సారీ సారీ సారీ, సో సారీ సారీ సారీ
మొదటిసారి ఇలా జరిగితే కలహం హోయ్
ముందు ముందు కలిసి ఉండుటే ఖాయం
జూన్ ఎండ ముగిసాక జూలై వాన వస్తుంది
నీ తీరు చూశాక తలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్ గా నెగ్గావమ్మో యమ్మో…
మాయేదో చేసావమ్మో నన్నే మొత్తంగా మార్చావమో
జాని జాని జాని విన్నా నీ కహానీ
రాజా హిందుస్తానీ మెచ్చాడే నీ బాణీ
చీకు చింత మాని అందించేయ్ జవాని
ఏదేమైనా కాని జైబోలో భవాని
లల లల లాలా లాలా (4)
********* ********** **********
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, ఫెబి మణి
మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా
వేదిస్తావేంటి వయసా నీక్కూడా నేనే అలుసా
తానేదో చేయి జారి తాకేనే ఒక్కసారి
ఆ మత్తే నన్ను చేరి అల్లింది హద్దు మీరి నాకేంటి దారి
మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా
వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా
ముద్దా తలుపులే మూసినా ఏకాంతమే లేదే
నిజం తెలిసినా నమ్మవే నువ్వే ఒంటిగ లేవే
అంతా అదే అన్నది అర్ధం ఏమై ఉంటది నిత్యం నీలో ఉన్నది నేనే కదా అన్నది
కనివిని ఎరుగనది కడున
మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా
వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా
వేలే తగిలితే ఒళ్లిలా వీణై పలుకుతుందా
ఆ గాలే తడిమితే ఇంతలా ప్రాణం ఉడుకుతుందా
వీచే గాలే నీవై విచ్చాసావే వెచ్చగా
విచ్చే పూవ్వే నీవై ఇచ్చేస్తావా కానుక
చిలిపిగ చిదుముకుపో త్వరగా
మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా
వేడెక్కి వేగి వయసా చిత్రంగా ఉందే వరసా
తానేదో చేయి జారి తాకేనే ఒక్కసారి
ఆ మత్తే నన్ను చేరి అల్లింది హద్దు మీరి నాకేం దారి
మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా
వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉంది వరసా
********* ********** **********
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో
చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా
చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా
కోటలో పవళించేటందుకు రాసే ఉంది
మన హార్ట్ లో ఒకరుండేటందుకు ప్లేసే ఉందోయ్
ఇంట్లో జలకాలాడేందుకు సవరే ఉందోయ్
మన ఒంట్లో లవ్వాడేటందుకు పవరే ఉందోయ్
శాట్లైట్లు ఇన్సాట్లు లోకాన్ని ఏలే కాలం
సరదాలు సరసాలు వదిలేస్తే మనకే నష్టం
చల్ చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా
నన్నే గురిపెట్టేటందుకు దునియా ఉందోయ్
పగవాన్నే ఓదార్చేటందుకు ఇండియా ఉందోయ్
ఫ్రీగా తెగ పెరిగేటందుకు క్రాఫే ఉందోయ్
హ్యాపీగా గడిపేసేటందుకు లైఫే ఉందోయ్
డిస్కోలు డేటింగ్లు చేస్తుంటే మాయాజాలం
బుద్ధావతారంలా బజ్జుంటే లేదోయ్ లాభం
చల్ చల్ చల్నేదో ఘాడి దొరక్కపోదుర జోడి
తెలుగోడి వాడి చాలాగ్గా చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాస మవ్వగ భలేగ బతికెయ్ రా
మిఠాయికోర్కెల చిటారుకొమ్మన గిటారు మీటెయ్ రా
********* ********** **********
చిత్రం: బావగారూ బాగున్నారా! (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, సుజాత
నవమి దశమి తగిన రోజులు
యువతి యువకుల తపనలకు
మకరం మిథునం వృషభ రాశులు
అనుకూలించును రసికులకు
దొరికినది సమయం ఓ…
విరహంతో సమరం
సాయం అందించు ఆలించు పాలించు
బిడియం చాలించు చుంబించు చిగురించు
నవమి దశమి తగిన రోజులు
యువతి యువకుల తపనలకు
ప్రాయం పెరటిలో లతలు అడిగే
తొలకరి చినుకువు నువ్వే
సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిదవు నువ్వే
చెంగావి రంగుల్లో చేరని
కంగారు రాగలే తీయని
దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు
తాపం వివరించు వినిపించు వికసించు
నవమి దశమి తగిన రోజులు
యువతి యువకుల తపనలకు
స్వర్గం దారిలో పరుగు తీసే పరువపు పరవడి నీదే
సర్వం దోచగా ఎదురు చూసే మధనుడి ఉరవడి నీదే
కావేరి పొంగుల్లో బుడగని
కస్తూరి తిలకాలే కరగని
మైకం కలిగించు కవ్వించు కరిగించు
మంత్రం పలికించు పులకించు పవళించు
నవమి దశమి తగిన రోజులు
యువతి యువకుల తపనలకు
మకరం మిథునం వృషభ రాశులు
అనుకూలించును రసికులకు
దొరికినది సమయం ఓ…
విరహంతో సమరం
సాయం అందించు ఆలించు పాలించు
బిడియం చాలించు చుంబించు చిగురించు